Begin typing your search above and press return to search.
ఒక పక్క లైవ్..మరో పక్క పోర్న్
By: Tupaki Desk | 20 Jan 2018 9:44 AM GMTముందు ముందు ఎవరైనా మనకు అర్థం కాని మేధావితనంతో ప్రవర్తిస్తే నువ్వు మనిషివా వర్మా అని అడిగే పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది. తన మాటలతో చేష్టలతో ఒక పజిల్ లా మారుతున్న వర్మ మీద బయట ఎంత వ్యతిరేకత ఉందో అంతే మోతాదులో ఫాన్స్ నుంచి అభిమానం కూడా ఉంది. అందుకే సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా వర్మ బ్రాండ్ ఉంటే చాలు సినిమా అయినా షార్ట్ ఫిలిం అయినా చూడడానికి రెడీ అయిపోతారు. దానికి తగ్గట్టే వర్మ కూడా ఎక్కడా తగ్గినట్టు కనిపించడు. కొత్తగా గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ ట్రైలర్ తో సంచలనం రేపిన వర్మ 26న దాని ఫుల్ వీడియో విడుదల అవుతున్న నేపధ్యంలో టీవీ ఛానల్స్ డిబేట్స్ లో పాల్గొంటూ దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మధ్యే జరిగిన ఒక డిబేట్ లో వర్మ ప్రవర్తన హాట్ టాపిక్ గా మారింది.
లైవ్ లో ఫోన్ ఇన్ లో ఉన్న వర్మకు ఒక మహిళా నేతకు మధ్య చర్చ జరుగుతోంది. ఆవిడ కాస్త గట్టిగానే జిఎస్టి వీడియో తీయడంలో ఉద్దేశాన్ని ప్రశ్నిస్తూనే వర్మను ఇరికించే ప్రయత్నం చేసారు. కాసేపు వాదించిన వర్మ తాను చెప్పాల్సిన పాయింట్స్ అవ్వడంతో ఆవిడ ఇంకా ఫోన్ లో ఏదో మాట్లాడుతూ ఉండగానే తన మానాన తాను స్మార్ట్ ఫోన్ తీసి చూసుకోవడం మొదలు పెట్టారు. దీంతో డౌట్ వచ్చిన యాంకర్ సరదాగా ఏంటి ఫోన్ లో పోర్న్ ఏమైనా చూస్తున్నారా అని అడగటం దానికి వర్మ బదులుగా అవును నిజం చెప్పారు పోర్న్ చూస్తున్నాను అని ఒప్పేసుకోవడం చూసి అవతల లైన్ లో లేడీ యాక్టివిస్ట్ కి కాసేపు మాటలు రాలేదు.
ఇలా చేయటం వర్మకు కొత్తేమి కాదు కాని ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు చూస్తున్న న్యూస్ ఛానల్ లో లైవ్ లో ఇలా పోర్న్ చూస్తున్నాను అని ఒప్పుకునే ధైర్యం వర్మకే ఉంటుంది. కాని అతన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇదేదో బాగుందే అని అనుసరించి ఎవరైనా అడిగితే అయన స్టైల్ లో ఇందులో తప్పేముంది అంటేనే అసలు సమస్య మొదలవుతుంది. అయినా వర్మ వీటన్నిటికి అతీతుడు కాబట్టి చూస్తూ ఉండటం తప్ప ఎవరు ఏమి చేయలేం.