Begin typing your search above and press return to search.
పద్దతి మార్చావేంటి వర్మా??
By: Tupaki Desk | 27 Jan 2018 2:32 AM GMTఈమధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ తీసిన వాటిలో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) చర్చల్లోకెక్కినంతగా ఏదీ రాలేదు. సెక్స్ పై పోర్న్ స్టార్ మియా మాల్వోవా స్వగతంగా తీసిన ఈ చిత్రం తీశానని ఆర్జీవీ బయటపెట్టినప్పటి నుంచి దీనిపై డిస్కషన్ జరుగుతూనే ఉంది. దీనికితోడు మియా న్యూడిటీని కనిపించి కనిపించకుండా రిలీజ్ చేసిన పబ్లిసిటీ పోస్టర్లు చాలామంది దృష్ణిని ఆకట్టుకున్నాయి.
జీఎస్టీపై జరిగిన డిస్కషన్ తో చాలామంది ఫోకస్ దీనిపై పడింది. దీంతో ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్ అండ్ టైం కు నెట్ ముందు కూర్చున్న వారికి అసలు సైట్ ఓపెన్ కాలేదు. తరవాత ఇంటర్ నెట్ ట్రాఫిక్ ఎక్కువై సైట్ క్రాష్ అయిందని ఆర్జీవీ క్లారిటీ ఇచ్చాడు. తరవాత మళ్లీ 27వ తేదీ ఉదయం రిలీజ్ అవుతుందంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. కానీ ఈ పోస్టర్ గమనించి చూస్తే సీను మొత్తం మారిపోయింది. ఇంతకుముందులా కాకుండా మియాను మొత్తం దుస్తుల్తో కప్పేసి ఆర్ట్ సినిమా తీసే డైరెక్టర్ స్టయిల్ లో ఆమెకు సూచనలిస్తూ ఆర్జీవీ కనిపించాడు. ఇదేంటి ఒక్కరోజులో ఆర్జీవీ ఫిలసాఫికల్ థాట్ లో ఇంతమార్పు ఎలా వచ్చేసిందంటూ ప్రేక్షకులు అయోమయ పడిపోతున్నారు.
జీఎస్టీపై ఇప్పటికి వచ్చిన వివాదాలు అన్నీఇన్నీ కావు. అందులో కొన్నింటికి సంబంధించి ఆర్జీవీపై కేసులు కూడా నమోదయ్యాయి. వాటికి సంబంధించి తరవాతైనా అతడు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చిత్రం వాయిదా వెనుక సైట్ క్రాషవడం కన్నా ఈ కేసుల వ్యవహారమే కీలకమని తెలుస్తోంది. పోస్టర్ లోనే పద్ధతి మార్చేసిన ఆర్జీవీ కంటెంట్ లోనూ పద్ధతి మార్చేసి ఉంటే?