Begin typing your search above and press return to search.
ఆ పాపం నాదే అంటున్న వర్మ
By: Tupaki Desk | 7 Nov 2015 9:53 AM GMTమొన్నటి రాజ్ తరుణ్ ట్వీట్లలో ఏదో మతలబు ఉందని చాలామంది అనుమానపడ్డారు. ఆ అనుమానమే నిజమైంది. పాపం ఆ కుర్రాడికి ఏ పాపం తెలియదు. అదంతా వర్మ పుణ్యమే. రాజ్ తరుణ్ ఫోన్ తీసుకుని వర్మే ఆ ట్వీట్లన్నీ పెట్టి ట్విట్టర్ జనాల్ని కంగారు పెట్టేశాడు. ఐతే అందరూ ఆ ట్వీట్లను నమ్మకపోయినా.. ఎందరో కొందరు నమ్మే ఉంటారు కదా. వాళ్లందరూ రాజ్ తరుణ్ కు అప్పుడే అంత బలుపేంటి అని తిట్టేస్తున్న సంగతి వర్మ చెవిన పడింది. అందుకే ట్విట్లర్ లో ఈ వ్యవహారం గురించి క్లారిటీ ఇచ్చాడు ఆర్జీవీ.
రాజ్ తరుణ్ చాలా మంచోడని.. అతడి గురించి అపార్థం చేసుకుని ఉంటే తనను మన్నించాలని.. తప్పంతా తనదేనని వర్మ సీక్రెట్ రివీల్ చేశాడు. ఏదో సరదాకి రాజ్ తరుణ్ ఫోన్ తీసుకుని తనే ట్వీట్లు పోస్ట్ చేసినట్లు చెప్పాడు. ఆర్జీవీ ‘జస్ట్ ఓకే’ డైరెక్టర్ అని.. తాను డైరెక్టర్ అయితే శివ - రంగీలా కంటే గొప్ప సినిమాలు తీసేవాడినని.. తమ కాంబినేషన్ లో రాబోయే సినిమాలకు సంబంధించి రాజ్ తరుణ్ ఏవైనా తప్పులు చేస్తే తాను కరెక్ట్ చేస్తానని.. రాజ్ తరుణ్ ట్విట్టర్ అకౌంట్లో వ్యాఖ్యలు కనిపించడం.. మరోవైపు వర్మ కూడా తనకంటే పూరి - వినాయక్ - రాజమౌళి కంటే గ్రేట్ డైరెక్టర్ కాగల సత్తా రాజ్ తరుణ్ కు ఉందని అదే సమయంలో ట్వీట్ పెట్టడం గందరగోళానికి తెరతీసిన సంగతి తెలిసిందే.