Begin typing your search above and press return to search.
అమెరికా ఎన్నికల్లో వర్మ అభ్యర్థి...
By: Tupaki Desk | 19 Oct 2016 7:46 AM GMTతాజాగా ఒక సర్వే... ప్రస్తుతం అమెరికా వాసులకు రెగ్యులర్ ఉండే స్ట్రెస్ కంటే ప్రస్తుతం జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబందించిన స్ట్రెస్ మరీ ఎక్కువైపోయిందట. కొంతమంది యువత - మధ్యవయస్కులపై జరిపిన సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే... ప్రస్తుతం ఎన్నడూ లేనంత స్థాయిలో హోరా హోరీగా సాగుతోంది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం. ట్రంప్ - హిల్లరీ... వ్యవస్థాగత చర్చలతో పాటు ఈసారి వ్యక్తిగత దూషణలకు కూడా తీవ్రంగా పాల్పడటంతో ఈ ఎన్నికలకు పెప్పర్ యాడ్ అయ్యింది. ఏనాడూ అమెరికా ఎన్నికలు ఈ స్థాయి వివాదాలతో, ఈ మార్కు ప్రచారాలతో ప్రపంచ మీడియాలో నానలేదనే చెప్పాలి. అయితే ఈ ఎన్నికలపై రాం గోపాల్ వర్మ తాజాగా తనదైన స్టైల్లో స్పందించారు.
ప్రపంచంలో జరిగే చాలా విషయాలపై తనదైన మార్కు స్టేట్ మెంట్స్ ఇచ్చే దర్శకుడు రాం గోపాల్ వర్మ... అమెరికన్లలు హిల్లరీని గెలిపించాలా, లేక ట్రంప్ ను గద్దె ఎక్కించాలా అనే డైలెమాలో ఉన్నారు. అయితే వీరిద్దరూ వద్దు "క్లంప్"కి ఓటెయ్యండి అని ఒక ఫోటోను వదిలారు. అదేంటి.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతోంది డొనాల్డ్ ట్రంప్ - హిల్లరీ క్లింటన్ లే కదా ఈ మూడో వ్యక్తి క్లంప్ ఎవరు అని అనుకుంటున్నారా? చూశారుగా ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తిని? కొంచెం హిల్లరీ క్లింటన్ - కొంచెం ట్రంప్ పోలికలు ఉన్నాయి కదా! ఈ వ్యక్తి రాం గోపాల్ వర్మ మార్కు సృష్టి! ట్రంప్ - హిల్లరీ ఫొటోలను కలిపి రూపొందించిన చిత్రాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ... "ఎవరికి ఓటెయ్యాలా అని కంఫ్యూజ్ అవుతున్న అమెరికన్ల కోసం ట్విట్టరూన్ మూడో అభ్యర్ధిని రూపొందించింది. అతనే క్లంప్. అంటే క్లింటన్ - ట్రంప్ అన్నమాట" అంటూ ట్వీట్ చేశారు.
ఏమాట కామాట చెప్పుకోవాలంటే... అంశం ఏదైనా, విషయం ఎలాంటిదైనా వర్మ స్పందించే విధానం వేరు, వర్మ ఆలోచనకున్న ప్రత్యేకతే వేరు.. ఏమంటారు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/