Begin typing your search above and press return to search.

ఒకేఒక్కడు.. జల్లికట్టుకు టోటల్ యాంటీ

By:  Tupaki Desk   |   21 Jan 2017 4:27 AM GMT
ఒకేఒక్కడు.. జల్లికట్టుకు టోటల్ యాంటీ
X
సాక్షాత్తూ పవన్ కళ్యాణ్‌ వంటి సెలబ్రిటీలు కూడా.. దేశంలో ఎన్నో గోవులను తినే మాంసం కోసం చంపుతున్నప్పుడు తప్పుకానప్పుడు.. జల్లికట్టు అనే ఆట కోసం వాటిని ఉపయోగించుకుంటే తప్పేం లేదనే భావన వచ్చేలా ఆల్రెడీ తమ వాయిస్ వినిపించేశారు. ఇక సెలబ్రిటీలందరూ.. ముఖ్యంగా తమిళ సెలబ్రిటీలైతే టాప్ నాచ్ లో ఈ విషయంపై కోరస్ పాడేశారు.

కాని నిజానికి జల్లికట్టు అంటే నోరు లేని జీవాలను హింసించడమే. ఇక జల్లికట్టు కావాలి అంటోంది మనుషులు.. ఆ క్రీడను వద్దని చెప్పడానికి సదరు జంతువులకు నోరు లేదు. సో ఎన్నయినా చెబుతాం. కాని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం.. ఈ విషయంలో జల్లికట్టును సపోర్టు చేస్తున్న వారిని ఏకిపారేశాడు. ''తమిళ వారికి జల్లికట్టు అనేది కరక్ట్ అయితే.. ఆల్ ఖైదీ తీవ్రవాదులకు కూడా అమాయకులైన వారిని పీక కోసి చంపడం కూడా కరక్టే. సినిమావాళ్ళేమో తెర మీద కనీసం ఒక పిట్టను కూడా హింసించినట్లు చూపకూడదు కాని.. తమిళ ప్రజలు మాత్రం గోవులను దారుణంగా హింసిస్తూ జల్లికట్టు ఆడుకోవచ్చా? జల్లికట్టు అనేది అనాగరికం'' అంటూ ట్వీట్లతో విరుచుకుపడ్డాడు వర్మ.

''జనాల ఆనందం కోసం మూగ జీవాలను హింసించడమే జల్లికట్టు. జయలలిత శశికళ వంటి లీడర్లను తెగల జాతుల్లా పూజించే జనాలకు ఇది కూడా నప్పిందిలే. జల్లికట్టును సపోర్టును చేస్తున్న సెలబ్రిటీలను.. 100 ఎద్దులతో తరుముతూ పరిగెత్తించాలి. అప్పుడు తెలుస్తుంది వారికి జనాలు ఎద్దులను తరిమితే వాటి ఫీలింగ్ ఎలా ఉంటుందో'' అంటూ రామూ గాట్టిగానే ఎద్దేవా చేశాడు. అసలు ఒక అనాగరిక హక్కు కోసం పోరాడుతున్న ఆ జనాలను ఏమనాలి? జంతువులను టార్చర్ చేయడానికి అధికారం అడుగుతున్న వారికి ఏమని చెప్పాలి? అంటూ ఆలోచింపజేసే ప్రశ్నలనే వేశాడులే.

''నోరు లేని జీవాలను జల్లికట్టు పేరుతో హింసించడం.. తీవ్రవాదం కంటే పెద్ద నేరమే'' అంటూ ముగింపు పలికాడు. వోట్ల కోసం.. పార్టీ టిక్కెట్ల కోసం.. ఈ సెలబ్రిటీలు అందరూ జల్లికట్టుకు సపోర్టునిస్తున్నారని డైరెక్టుగానే చెప్పేశాడులే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/