Begin typing your search above and press return to search.
అమ్మో.. వర్మ ఏమాత్రం తగ్గట్లేదు
By: Tupaki Desk | 21 Jan 2017 5:12 PM GMTఆల్రెడీ ట్విట్టర్లో జల్లికట్టు అంశంపై చాలా క్లియర్ కట్టుగా తన వాదనను వినిపించేశాడు రామ్ గోపాల్ వర్మ. జల్లికట్టు అనే క్రీడ అనాగరికం.. దానికి కల్చర్ తో ముడిపెడితే అవతల ఆల్ ఖైదీ తీవ్రవాదులు జనాలను చంపడం కూడా కల్చర్ అనే అంటారంటూ ప్రత్యక్షంగానే పెద్ద ఎటాక్ చేసేశాడు ఈ సంచలన దర్శకుడు. కాని మనోడు జల్లికట్టుకు యాంటీగా ట్వీట్ చేసిన మరుక్షణం నుండి చాలామంది తమిళులు ఇతడి టైమ్ లైన్ ను హోరెత్తిస్తున్నారు. కొందరు సెలబ్రిటీ డైరక్టర్లు కూడా మనోడిపై పంచ్ లు వేస్తున్నారు. దమ్ముంటే తమిళనాడు వచ్చి మాట్లాడాలంటూ సవాల్ చేస్తున్నారు. కాని ఎవరేమన్నా మాత్రం మనోడు మాత్రం అస్సలు తగ్గట్లేదు.
''ఒకవేళ తమిళనాడు ప్రజలకు తలొగ్గి సుప్రీం కోర్టు జల్లికట్టుకు ఫేవర్ గా మరో డెసిషన్ చెబితే మాత్రం.. ఇండియాలో అస్సలు రాజ్యాంగం అనేదే లేనట్లు'' అంటూ వర్మ మరోసారి సంచలనాత్మకమైన ట్వీట్లు వేశాడు. ''అమాయక జంతువులను టార్చర్ చేద్దాం అనుకుంటున్న ప్రజలు చాలా క్రూరమైన జంతవులుని సుప్రీం కోర్టు గ్రహించాలి'' అంటూ పిచ్చెక్కించాడు. మామూలుగా చాలామంది ఈ విషయంలో సైలెంట్ అయిపోతుంటే.. వర్మ మాత్రం.. ''త్రిషను ఎటాక్ చేసిన ఆన్ లైన్ ఎద్దులన్నీ వారు వశం చేసుకోవాలనుకుంటున్న ఎద్దులకన్నా వరస్ట్'' అంటూ కామెంట్ విసిరేశాడు. ఏదేమైనా వర్మ అంతేనబ్బా.. ఒకపట్టాన ఏదీ ఆపేయడు. మొదలెట్టడమే లేటు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/