Begin typing your search above and press return to search.
జాతిరత్నంపై వర్మ సెటైర్..నవ్వులే నవ్వులు!
By: Tupaki Desk | 7 July 2022 2:30 AM GMTరాంగోపాల్ వర్మ సెటైరికల్ యాంగిల్ గురించి తెలిసిందే. ఆ సెటైర్ లోనే కావాల్సినంత ఫన్ అందించగల సమర్ధుడు వర్మ. వర్మ లో సీరియస్ థింగ్ ని పక్కనబెడితే..ఆయన క్యాజువల్ గా మాట్లాడితే! అందులో చాలా ఫన్ కనిపిస్తుంది. సీనియర్ హీరోల దగ్గర నుంచి జూరియర్ హీరోల వరకూ ఎవరిపైనైనా వర్మ సెటైర్ పంచ్ కి నవ్వాల్సిందే.
వర్మలో ఆ సెటైర్ నుంచే తన పాత సినిమాల్లో బోలెడంత హాస్యాన్ని పండించాడు. ఎంతటి సీరియస్ జోనర్ అయినా అక్కడ ఫన్ క్రియేట్ అవసరమంటే అద్భుతమైన సింకింగ్ తో అక్కడ సీన్ క్రియేట్ చేస్తాడు.
తాజాగా యువ దర్శకుడు..జాతిరత్నం అనుదీప్ పై వేసిన ఓ సెటైర్ గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనుదీప్ ఓ సారి వర్మ వద్దకు కామెడీ రైటర్స్ రిక్వెర్ మెంట్ ఉంటే స్నేహితుడి ద్వారా వెళ్లాడుట.
అప్పుడు వర్మ అనుదీప్ ముఖం పరిశీలించి నీ ముఖం ఇంత విషాకరంగా ఉంది? నువ్వు కామెడీ రాస్తావా? అన్నారుట. దాన్ని అనుదీప్ అంతే సరదాగా తీసుకున్నాడుట. అతని మనోభావాలు ఏమాత్రం దెబ్బ తినలేదుట. ఇక్కడ అనుదీప్ గురించి చెప్పాలి. అనుదీప్ మంచి కామెడీ రైటర్ అని జాతిరత్నాలు సినిమాతో బయటపడింది. సినిమా రిలీజ్ కి ముందు వింత వింత సమాధానాలతో యాంకర్లని మూడు చెరువుల నీళ్లు త్రాగించాడు.
అస్పష్టమైన సమాధానాలు..వ్యవహారిక శైలితో యాంకర్లు ఇబ్బంది పడ్డారు. ఇతనేంటి? వర్మ కన్నా వెరైటీగా ఉన్నాడు? అన్న తీరున హైలైట్ అయ్యాడు. ఏదైతేనేం! వర్మలా మాట్లాడాల్సి వస్తే ఎవరి పైత్యం వారిది. ఎవరికి నచ్చినట్లు వాళ్లుండొచ్చు. సెటైర్లని సీరయిస్ గా తీసుకునే వాళ్లు అయితే వివాదాలొస్తాయి. కామ్ గా ఉంటే? ప్రశాంతత దొరుకుతుంది.
అనుదీప్ రెండవ రకం. ఎవరు ఎలా తిట్టినా కొప్పడని ఏకైక జీవిని అని ఆయన చెప్పాడు. ప్రస్తుతం ఈ జాతిరత్నానికి అవకాశాలు బాగానే వస్తున్నాయి. కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే తెలుగులోనూ మీడియం రేంజ్ హీరోలు రెడీగా ఉన్నారు.