Begin typing your search above and press return to search.

అతనే సరైన ఖాన్.. అందరూ పిచ్చోళ్లే

By:  Tupaki Desk   |   28 Dec 2016 5:09 AM GMT
అతనే సరైన ఖాన్.. అందరూ పిచ్చోళ్లే
X
ఏ టాపిక్ పై అయినా ఎక్స్ ట్రీమ్ లెవెల్ లో కామెంట్స్ చేయాలంటే రామ్ గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా. తాజాగా వంగవీటి సినిమా విషయంలో బస్తీ మే సవాల్ అంటూ ఛాలెంజ్ లు చేసిన వర్మ.. ఇప్పుడు బాలీవుడ్ దంగల్ చూశాడట. ఆమిర్ ఖాన్ నటించిన ఈ చిత్రం తెగ నచ్చేయడంతో.. ఇక సినిమా ఇండస్ట్రీపై కామెంట్స్ మొదలుపెట్టేశాడు.

'భారతీయ ప్రేక్షకుల తెలివితేటలపై ఆమిర్ ఖాన్ నమ్మకానికి సలాం కొట్టాల్సిందే. సూపర్ స్టార్లు ఎప్పటికీ యంగ్ గానే కనిపిస్తుంటారు. 50ల తర్వాత కూడా సిక్స్ ప్యాక్ లు చేసి చూపిస్తుంటారు. ఆమిర్ కూడా అదే చేశాడు. అసాధ్యం అనుకున్న వాటిని చేసి చూపిస్తూ.. అలా అలా ఎదగడంలో చూపిస్తున్న సిన్సియారిటీని చూస్తే.. ఆమిర్ పాదాలలను తాకాలని ఉంది. ఇతర ఖాన్స్ అంతా ప్రేక్షకులను వెర్రివాళ్లను చేద్దామని అనుకుంటే.. ఆమిర్ మాత్రం వారి ఇంటెలిజెన్స్ నమ్ముతాడు' అంటూ ఓ రేంజ్లో భజన చేశాడు వర్మ.

ఇక్కడితో ఏమీ ఆగిపోలేదు. 'ఇతర ఖాన్ ల కారణంగా ఇండియాని ప్రపంచం పిచ్చోళ్ళలా (మనోడు భారీ బూతే వాడేశాడు ఇక్కడ) చూస్తుంటే.. ఆమిర్ కారణంగా ప్రపంచం అంతా ఇండియాని సీరియస్ గా తీసుకోవాల్సి వస్తోంది. ఆలం ఆరా కాలం నుంచి చూస్తున్నా.. ఏ స్టార్ హీరో అయినా తండ్రిగా కనిపించేందుకు బరువు పెరిగి లావుగా కనిపించాలని అనుకున్నాడా? దంగల్ చూసిన తర్వాత నాకేమనిస్తోందంటే.. ఖాన్ ల తో పాటు మొత్తం ఇండస్ట్రీ అంతా జిమ్నాస్టిక్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని.. తమను తామే As.. లపై తన్నుకోవాలి' అంటూ హితోపదేశాలు చేస్తూ.. ఏకంగా ఖాన్ లకే ఫిట్టింగ్ లు పెట్టేశాడు వర్మ.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/