Begin typing your search above and press return to search.

రాజధాని అనకాపల్లిలో ఉంటే ఏంటి? చెన్నైలో ఉంటే ఏంటి : ఆర్జీవీ !

By:  Tupaki Desk   |   27 Dec 2019 11:20 AM GMT
రాజధాని అనకాపల్లిలో ఉంటే ఏంటి? చెన్నైలో ఉంటే ఏంటి : ఆర్జీవీ !
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన , అలాగే జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై అమరావతి ప్రాంత ప్రజలు , గతంలో అమరావతిలో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు గత పది రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఇదే హాట్ టాపిక్ . కొంతమంది మూడు రాజధానుల ప్రతిపాదనకు సముఖత వ్యక్తం చేస్తుంటే ..మరికొంతమంది మాత్రం విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.

ఈ తరుణంలో రాజధాని వ్యవహారం పై సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. తాజాగా ఈ రాజధాని అంశం పై వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ కూడా స్పందించారు. ఆయన చాల వింత ప్రతిపాదన చేశారు. సాధారణంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను శభాష్ అనే రామ్ గోపాల్ వర్మ రాజధాని వ్యవహారంలో కొంచెం భిన్నంగా స్పందించారు . ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో ఆసక్తికరంగా మారాయి . 'బ్యూటిఫుల్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వర్మతో పాటు చిత్ర యూనిట్ వైజాగ్ లో సందడి చేసింది.

ఈ సందర్భంగా వర్మ ఏపీ రాజధానిపై తనదైన శైలిలో స్పందించారు. తన దృష్టిలో రాజధాని అన్న పదానికి అర్ధమే లేదని , ఏ అర్ధం లేనప్పుడు రాజధాని అనకాపల్లిలో ఉంటే ఏంటి?, చెన్నైలో ఉంటే ఏంటి?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రాజధాని అంటే మెయిన్ థియేటర్‌ లాంటిదన్నారు. అది ఎక్కడ ఉన్నా ఒకటే అన్నారు. ప్రజలకు నేరుగా పాలన అందాలనుకుంటే ప్రతి టౌన్‌కి ఒక క్యాపిటల్‌ ఉండాలని స్పష్టం చేశారు.