Begin typing your search above and press return to search.
మెగాస్టార్.. వర్మ మాటలు విన్నారా?
By: Tupaki Desk | 17 Oct 2015 5:49 AM GMTవర్మ ఏం మాట్లాడినా కొంచెం అతిశయోక్తులు జోడిస్తాడనడంలో సందేహం లేదు. అలాగని అసలు విషయంలో మేటర్ ఉండదని కొట్టిపారేస్తే పొరబాటే. ‘అత్తారింటికి దారేది’ సమయంలో కలెక్షన్ల గురించి, పవన్ కళ్యాణ్ గురించి వర్మ ఎలా పొగిడాడో అలాగే వచ్చింది సినిమా ఫలితం. ఇక ‘టెంపర్’ విషయంలో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ గురించి కూడా ఇలాగే అతిగా స్పందించాడని అనిపించినా.. సినిమా చూశాక వర్మ అంత ఉద్వేగం తెచ్చుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదనిపించింది. ఉద్దేశపూర్వకంగా, కావాలనే టూమచ్ గా ఎగ్జైట్ అవుతాడన్న మాటే కానీ.. వర్మ మాటల్ని అన్నిసార్లూ తేలిగ్గా కొట్టిపారేయలేం.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీఎంట్రీ చేయబోయే మూవీ విషయంలో వర్మ చేసిన వ్యాఖ్యల్ని కొంచెం పట్టించుకోవాల్సిందే. ‘కత్తి’ రీమేక్ తో చిరంజీవి రీఎంట్రీ చేయబోతున్నాడన్న వార్తల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు వర్మ. తమిళ సినిమాను కాపీ చేసి.. తెలుగు ప్రతిష్టను దెబ్బతీయొద్దని వ్యాఖ్యానించారాయన. ఓ ఒరిజినల్ తెలుగు కథ ద్వారా రీఎంట్రీ ఇస్తేనే బాగుంటుందన్నాడు. అది ‘బాహుబలి’ని మించి ఉండాలన్న పాత పాట కూడా పాడాడు.
పనిలో పనిగా చిరంజీవి క్యామియో రోల్ చేసిన ‘బ్రూస్ లీ’ మీద సెటైర్లు గుప్పించాడు వర్మ. లెక్క ప్రకారం ఇది చిరంజీవి 150వ సినిమా అని.. చిరు తన రీఎంట్రీకి ఇలాంటి సినిమాను ఎంచుకోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నాడు వర్మ. బ్రూస్ లీ సినిమా చూశాక తాను మళ్లీ బ్రూస్ లీ నటించిన ‘ఎంటర్ ద డ్రాగన్’ సినిమా చూస్తున్నానని.. మన ‘బ్రూస్ లీ’ సినిమా చూశాక ఎలా ఫీలయ్యేవాడో అంటూ బ్రూస్ లీ ఇబ్బందికరంగా ఫేస్ పెట్టిన ఓ పిక్ ను పోస్ట్ చేశాడు. తాను ‘ఆగ్’ సినిమా తీసినపుడు షోలే దర్శకుడు రమేష్ సిప్పీ కూడా ఫీలింగ్ కూడా ఇలాగే ఉండేది అనడం ద్వారా బ్రూస్ లీ మీద తన అభిప్రాయమేంటో చెప్పకనే చెప్పేశాడు వర్మ.