Begin typing your search above and press return to search.

చోటారాజన్ పై ఆసక్తిగా ఉందట

By:  Tupaki Desk   |   28 Oct 2015 3:29 PM GMT
చోటారాజన్ పై ఆసక్తిగా ఉందట
X
ఇండియాలో మాఫియా అంటే దావూద్ ఇబ్రహీం పేరు ఎలా గుర్తొస్తుందో.. ఆ కాన్సెప్ట్ పై సినిమాలంటే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా అలాగే గుర్తొస్తాడు. అలాంటి వర్మ.. ఓ మాఫియాడాన్ గురించి ట్వీట్ చేస్తే సంచలనం కాకుండా ఎలా ఉంటుంది. రీసెంట్ గా ఇండోనేషియా పోలీసులకు పట్టుబడ్డ ఇండియన్ డాన్ చోటా రాజన్ పై ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు వర్మ.

కొన్నేళ్ల క్రితం రామ్ గోపాల్ వర్మ కంపెనీ అనే మూవీ తీశాడు. ఇది దావూద ఇబ్రహీం, చోటా రాజన్ లకు తెరరూపమే అంటారు చాలామంది. ఈ విషయాన్ని ఆయనేం చెప్పలేదు కానీ.. సినిమా చూసినోళ్లకి కూడా ఇదే ఫీలింగ్ కలుగుతుంది. అంతగా అండర్ వరల్డ్ పై స్టడీ చేసి తీసిన మూవీ అది.

ఇప్పుడు వారిలో ఒకరైన చోటారాజన్ అరెస్ట్ కావడంతో.. రామ్ గోపాల్ వర్మకు ఓ విషయం ఆసక్తి కలిగిస్తోందట. ఇంతగా అండర్ వరల్డ్ ని మెయింటెయిన్ చేయడానికి.. ప్రభుత్వ పెద్దలు, పోలీసుల సహకారం అవసరం. "పోలీసుల విచారణలో ఎవరి పేర్లను చోటా రాజన్ బయటపెట్టబోతున్నాడనే విషయంపై ఆసక్తిగా ఉంది" అంటూ వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తాజ్ హోటల్ పేలుళ్లనే సినిమాగా మార్చేసిన ఆయనకు.. ఈ ఆలోచన రావడం పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే.. కేవలం చోటా రాజన్ పై ఇప్పుడు మూవీ ప్లాన్ చేయడం కష్టం. అదే ఒకళ్లిద్దరు బడాబాబుల పేర్లు తెలిస్తే.. అప్పుడు స్క్రీన్ ప్లే రంజుగా ఉంటుంది. అందుకోసమే వర్మ వెయిట్ చేస్తూ ఉండొచ్చనిపిస్తోంది.