Begin typing your search above and press return to search.
ట్రంప్ ను మించిన దేశద్రోహి అమెరికాలో లేరు: వర్మ
By: Tupaki Desk | 1 May 2020 3:00 PM ISTరాంగోపాల్ వర్మ.. డొనాల్డ్ ట్రంప్.. ఇద్దరూ వివాదాస్పదులే.. ఇద్దరికి నోటిదురుసు ఎక్కువే. ఇద్దరూ తాము పట్టిన కుందేలుకు మూడు కాళ్లేనని వాదిస్తారు. అలాంటి వారు కోతలు కోస్తారు.. తాజాగా ఈ ఇద్దరిలో వర్మ తాజాగా ట్రంప్ పై హాట్ కామెంట్స్ చేశారు.
తాజాగా వర్మ ట్విట్టర్ లో ట్రంప్ పై ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు. ట్రంప్ కంటే పెద్ద దేశద్రోహి అమెరికాలో లేడని విమర్శించారు. కరోనా క్లిష్ట సమయంలో అధ్యక్షుడిగా సమర్థవంతమైన పాలన అందించాల్సింది పోయి అమెరికా లోపాలను.. చెడు విషయాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఇన్నాళ్లు ప్రపంచ జనమంతా అమెరికా ఏఏ విషయాల్లో ఉత్తమంగా ఉందోనని అనుకుంటున్నారో.. అవన్నీ ఉత్తివే అని స్వయంగా అధ్యక్షుడే చెప్తున్నారని వర్మ ఎద్దేవా చేశారు.
కరోనా పోరులో తెగ పనిచేస్తున్నానని పేర్కొన్న ట్రంప్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. ‘డొనాల్డ్ ట్రంప్ యుద్ధకాలపు అధ్యక్షుడు’ అని పేర్కొన్నారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ - ట్రంప్ ఫొటోతో ఉన్న ఓ మీమ్ ను కూడా వర్మ షేర్ చేసి సెటైర్లు వేశారు.