Begin typing your search above and press return to search.
జై హాలీవుడ్ అంటున్న వర్మ
By: Tupaki Desk | 7 May 2016 8:28 AM GMTనచ్చనివాళ్లంతా రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ కోసం పాకులాడుతుంటాడని, సంచలనాల కోసమే ఆయన ట్వీట్లు చేస్తుంటాడని చెప్పుకొంటుంటారు. కానీ వర్మ చేసే ట్వీట్లు కేవలం పబ్లిసిటీ స్టంట్స్ అన్నట్టుగా మాత్రమే వుండవు. ఆ ట్వీట్లలో చాలా విషయముంటుంది. కొన్ని పచ్చి నిజాలు వుంటాయి. అందుకే వర్మ ట్వీట్లు ఇప్పటికీ వార్తలవుతుంటాయి. తాజాగా ఆయన బాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాల తీరు గురించి ట్వీట్లతో ఏకి పారేశాడు. హాలీవుడ్ సినిమాలు మన దగ్గర ఏ రేంజ్ లో సక్సెస్ అవుతున్నాయో, అందుకు కారణమేంటో చెబుతూ జై హాలీవుడ్ అన్నాడు. ఆయన ట్వీట్లలో ఉన్న విషయాలన్నీ నమ్మాల్సిన పచ్చి నిజాలే.
మన బాలీవుడ్ మన భారత్ మహాన్ అంటుంటే అమెరికా మాత్రం భారత్ లో మన హాలీవుడ్ మహాన్ అంటోందని ట్వీటాడు. హాలీవుడ్ సినిమాలు మన దగ్గర ఏ రేంజ్ లో సక్సెస్ అవుతున్నాయో చెబుతూ సెటైరికల్ గా ఆయన ఇలా ట్వీటాడు. అలాగే మనవాళ్లకి ఎంత గొప్ప బడ్జెట్టు ఇచ్చినా ఇన్సెప్షన్ - జంగిల్ బుక్ - అవతార్ లాంటి సినిమాలు తీయలేరని, మనవాళ్లకి ఆ బ్రెయిన్ లేదని ట్వీటాడు వర్మ. మన జాతిపిత అయిన గాంధీ మహాత్ముడి జీవితంపై సినిమాని కూడా హాలీవుడ్డే తీయాల్సి వచ్చిందని, ఆ సినిమా వచ్చి ముప్పయ్యేళ్లయినా ఆ స్థాయి ప్రమాణాలతో మనం ఇప్పటిదాకా గాంధీ సినిమాని తీయలేకపోయామని చెప్పుకొచ్చాడు.
గాంధీ ఒక్కరే బ్రిటిషన్లపై పోరాటం చేసి గెలిచారని, కానీ ఇప్పుడు వందమంది గాంధీలు కలిసినా మన దేశంలో హాలీవుడ్ పై పోరాటం చేయలేరని ట్వీటాడు. షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ కూడా హాలీవుడ్ నుంచి వచ్చే చిన్న పిల్లల సినిమాల్ని చూసి జడుసుకొంటున్నాడని వర్మ ట్వీటాడు. అంతా సరే కానీ... ఇన్ని విషయాలు తెలిసిన మన వర్మ ఏం చేస్తున్నట్టు? ఆయన కూడా ఓ డైరెక్టరే కదా, మరి సంచలనాలు సృష్టించే సినిమా ఏదైనా చేయొచ్చుగా!