Begin typing your search above and press return to search.
బాబోయ్ వర్మ.. లెజెండ్స్‌పై పడ్డాడు
By: Tupaki Desk | 18 March 2015 9:30 AM GMTచేతిలో ఎన్ని సినిమాల్లో.. వాటి షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా రాత్రి పడుకోబోయే ముందు ట్విట్టర్‌ను కెలక్కుంటే రాంగోపాల్ వర్మకు నిద్ర పట్టదేమో.ఈ మధ్య నాలుగైదు రోజుల పాటు మహిళల సమస్యలు, రేప్‌ల గురించి ఓ సామాన్యుడిలా గళమెత్తిన వర్మ.. మళ్లీ తన రూట్లోకి వెళ్లిపోయి.. లక్ష్మీదేవిని అమెరికా వాళ్లు పూజించకున్నా అక్కడ ఎక్కువ డబ్బుందంటే అది లక్ష్మీదేవి లోపమా.. లేక ఆమెను పూజించే మన మూర్ఖత్వమా అని ప్రశ్నించి అందరినీ అయోమయంలోకి నెట్టాడు. అంతటితో ఆగకుండా యాపిల్ సంస్థ నుంచి యాపిల్ అమ్మాయిలు కూడా వస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించి ఝలక్ ఇచ్చాడు.
ఇప్పుడిక ఇద్దరు లెజెండ్స్ మీద పడ్డాడు వర్మ. అలనాటి నటి, ప్రస్తుత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత హీరోయిన్గా ఉన్న రోజుల్లో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేసి.. ఈ ఫొటోలో నాకేం నచ్చిందో చెప్పలేకపోతున్నా అని ట్వీట్ చేశాడు వర్మ. ఆ ఫొటో చూసి.. ఆర్జీవీ కామెంట్లో ఆంతర్యమేంటో అర్థం కాక జనాలకు పిచ్చెక్కిపోతోంది. ఇక వర్మ పోస్ట్ చేసిన మరో ఫొటో ఇంకా సెన్సేషనల్. దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావు.. బర్క్లీ సిగరెట్‌కు ప్రచారం చేసిన ఫొటో అది. ఆ యాడ్ కూడా భలే చిత్రంగా ఉంది. దాన్ని ఉద్దేశించి.. ''నాకు సిగరెట్లంటే అసహ్యం. కానీ ఎస్వీఆర్ గారు ప్రచారం చేయడం వల్ల నాకీ యాడ్ భలే నచ్చింది'' అన్నాడు వర్మ.