Begin typing your search above and press return to search.

మెగా అనే మాట‌కి ఇక అర్థం లేద‌న్న వ‌ర్మ‌

By:  Tupaki Desk   |   16 July 2015 4:17 AM GMT
మెగా అనే మాట‌కి ఇక అర్థం లేద‌న్న వ‌ర్మ‌
X
రామ్‌గోపాల్ వ‌ర్మ `బాహుబ‌లి` జ‌పం మాన‌డం లేదు. సినిమా విడుద‌లైన రోజూ నుంచి బాహుబ‌లికి సంబంధించిన ట్వీట్ల‌నే వ‌దులుతున్నాడు. రాజ‌మౌళినీ, ప్ర‌భాస్ నీ ఆకాశానికెత్తేస్తున్నాడు. `బాహుబ‌లి`లాంటి ఒక అంత‌ర్జాతీయ సినిమా చేశారు కాబ‌ట్టి వాళ్లిద్ద‌రినీ వ‌ర్మ కీర్తించ‌డంలో త‌ప్పు లేదు. కానీ ఆ సినిమా రికార్డుల్ని మిగ‌తా సినిమాల‌తోనూ, మిగ‌తా హీరోల‌తోనూ పోలుస్తూ ఇటు ప‌రిశ్ర‌మ‌లోనూ, అటు అభిమానుల్లోనూ వేడి పుట్టిస్తున్నాడు.

తాజాగా చిరంజీవికీ, బాహుబ‌లి క‌లెక్ష‌న్ల‌కీ ముడిపెట్టాడు వ‌ర్మ‌. ``చిరంజీవిని మెగాస్టార్ అన్న‌ది మెగా క‌లెక్ష‌న్లు సాధించ‌డంతోనే! కానీ `బాహుబ‌లి` విడుద‌ల‌య్యాక మెగా అన్న మాట‌కి అర్థ‌మే లేకుండా పోయింది. పాత‌బ‌డిన ఆ బిరుదు స్థాయిని పెంచుకొనేలా ఆయ‌న 150వ సినిమా చేయాలి`` అని ట్వీట్ చేశాడు వ‌ర్మ‌. అంత‌టితో ఆగ‌లేదు. బాహుబ‌లినీ, ఆ సినిమా క‌లెక్ష‌న్ల‌నీ... రాబోయే సినిమాల‌కి కూడా ముడిపెట్టాడు. ``బాహుబ‌లి ఒక సింహం అయితే... ఆ సినిమా సాధించిన వ‌సూళ్లు అడ‌విని త‌ల‌పిస్తున్నాయి. వాటితో రాబోయే పెద్ద హీరోల సినిమాల్ని పోల్చి చూస్తుంటే వీధుల్లో తిరిగే కుక్క‌ల్లా క‌నిపిస్తాయేమో అనిపిస్తోంది`` అని ట్వీట్ చేశాడు వ‌ర్మ‌. రాబోయే రోజుల్లో ఇంకెలాంటి ట్వీట్లు చేస్తాడో వ‌ర్మ‌.