Begin typing your search above and press return to search.

వారిని కాపాడుకోవడం కోసం ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారని స్టార్ హీరో ఫీల్ అయ్యాడు!

By:  Tupaki Desk   |   25 July 2020 1:30 AM GMT
వారిని కాపాడుకోవడం కోసం ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారని స్టార్ హీరో ఫీల్ అయ్యాడు!
X
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు నెపోటిజంపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్యకు సినీ ఇండస్ట్రీలో ఉండే నెపోటిజం మరియు కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులే కారణమని నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అతనికి ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ లేకపోవడం వలన కనీస గౌరవం ఇవ్వలేదని.. సుశాంత్ ని అన్ని విధాలుగా తొక్కేశారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నెపోటిజం పై స్పందించారు. నెపోటిజం అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుంది.. అన్ని చోట్ల ఉంటుంది. మన పిల్లల్ని బంధువుల పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అనేది కామన్ గా అన్ని రంగాల మాదిరే సినిమా ఇండస్ట్రీలోనూ ఉంది అని వర్మ అభిప్రాయపడ్డారు.

ఇక సుశాంత్ ఫెయిల్యూర్ కాదని.. 75 కోట్ల మార్కెట్ ఉన్న హీరో అని.. అలాంటి హీరో ఆఫర్స్ లేవని సూసైడ్ చేసుకుంటే అసలు ఛాన్సెస్ రాని వారు ఎంతమంది సూసైడ్ చేసుకోవాలి?.. సినిమా ఛాన్సెస్ లేక సుశాంత్ చనిపోయాడని నేను అనుకోవడం లేదని.. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రొటెస్ట్ చేస్తున్నవాళ్లంతా అలా జరిగి ఉండొచ్చనే ఆలోచనతో ఉన్నారని పేర్కొన్నారు. ఒకవేళ సుశాంత్ చనిపోవడానికి అదే రీజన్ అయ్యుంటే అతనిపై నేను సింపతీ కూడా చూపించనని.. కరణ్ జోహార్ లాంటి ప్రొడ్యూసర్ 150 కోట్ల మార్కెట్ ఉన్న వేరే హీరోతో సినిమా ఎందుకు తీయకూడదు అని ప్రశ్నించారు.

ఇండస్ట్రీలో కుట్ర పన్ని మమ్మల్ని తొక్కేస్తున్నారనే భావన కొందరిలో ఉంటుందని.. ఓ ఫేమస్ తమిళ్ హీరో తనతో మాట్లాడుతూ బన్నీని - రానా దగ్గుబాటిని కాపాడుకోవడానికి సురేష్ బాబు - అల్లు అరవింద్ కలిసి అతన్ని తొక్కేయడానికి ట్రై చూస్తున్నారని చెప్పాడని వర్మ వెల్లడించారు. అది నిజమో కాదో అనేది పక్కన పెడితే అది అతను నమ్ముతున్నాడు... అలాంటి మెంటల్ స్టేట్ ఇండస్ట్రీలో చాల మందికి ఉంటుంది.. అది నిజం కాదు. మన వాళ్లే సక్సెస్ అవ్వాలి.. అవతలి వాడు ఫెయిల్ అవ్వాలి అని కోరుకోవడం అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది.. అది మానవ నైజం.. అది లేనట్లు నటిస్తారు కానీ అది లేకుండా ఉండదు అని చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ ని లాంచ్ చేసారు.. చరణ్ కాకుండా వేరే ఎవరినో చిరంజీవి లాంచ్ చేయడానికి అదేమి అతని డ్యూటీ కాదు కదా.. ఆయన సంపాదించుకున్న పేరు అతని కొడుక్కి రావాలని కోరుకుంటాడు.. దానిలో తప్పేముంది అని వర్మ చెప్పారు. ధీరూభాయ్ అంబానీ తన ఆస్తి కొడుకులకు ఇచ్చాడు.. ముఖేష్ అంబానీ తన కొడుక్కి కాకుండా మీకు నాకు ఎందుకు ఇస్తారు అని ప్రశ్నించారు. నెపోటిజం అనే బిగ్గెస్ట్ జోక్ అని నేను నమ్ముతాను. కంగనా రనౌత్ కి ఎదురైన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఆమె మాట్లాడుతుంది.. కానీ అందరూ ఆలోచించాల్సింది ఆమె ఇప్పుడు ఓ స్టార్.. ఇండస్ట్రీలో ఆమె టాలెంట్ ని ఎవరూ ఆపలేకపోయారు కదా.. ఇదంతా జనాల మీద ఆధారపడి ఉంటుందని.. ఫెయిల్ చేసినా సక్సెస్ చేసినా వాళ్లే చేస్తారు అని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేసారు.