Begin typing your search above and press return to search.
వర్మకు కొత్త బేరం తగిలింది
By: Tupaki Desk | 24 April 2016 6:22 AM GMTఓ పక్క అమీర్ ఖాన్ చాలా ఏళ్లుగా మంచి టేస్టున్న - కంటెంట్ ఉన్న సినిమాలు చేసుకుంటూ.. సినిమా సినిమాకూ తన ప్రత్యేకత చాటుకుంటూ.. తన స్థాయి పెంచుకుంటూ సాగిపోతున్నాడు. మరోవైపు సల్మాన్ ఖాన్ లో సైతం మార్పు కనిపిస్తోంది. గత ఏడాది ‘భజరంగి భాయిజాన్’ లాంటి మంచి సినిమా చేసి ప్రశంసలు అందుకున్నాడు. ఎటొచ్చీ షారుఖ్ ఖాన్ పరిస్థితే అగమ్య గోచరంగా మారిపోయింది. కమర్షియల్ సినిమాల పేరుతో అర్థం పర్థం లేని సినిమాలు చేస్తూ తన పేరును బాగా చెడగొట్టుకున్నాడు షారుఖ్. ఇలాంటి సమయంలో లేక లేక ‘ఫ్యాన్’ అనే ఓ మంచి సినిమా చేశాడు కింగ్ ఖాన్. ‘చక్ దే ఇండియా’ తర్వాత షారుఖ్ సినిమాకు మంచి పేరు రావడం ఇదే తొలిసారి. కలెక్షన్లు కాస్త అటు ఇటుగా ఉన్నా.. షారుఖ్ మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇకపై షారుఖ్ ఇలాంటి మంచి సినిమాలు తరచూ చేయాలని అభిప్రాయపడుతున్నారు జనాలు.
ఐతే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఇలాంటి వెరైటీ సినిమాల జోలికి ఎందుకు వెళ్తావ్.. చక్కగా మసాలా సినిమాలు చేసుకోమంటూ సలహా ఇస్తున్నాడు. షారుఖ్ ఖాన్.. రజినీకాంత్ లాంటి వాడని.. కమర్షియల్ సినిమాలే చేసుకుంటే మెగా రజినీకాంత్ అవుతాడని.. అలా కాకుండా ‘ఫ్యాన్’ తరహా ఆర్డినరీ సినిమాలు చేస్తే తన స్థాయి తగ్గించుకోవడమే అని వర్మ అభిప్రాయపడ్డాడు. ఒకప్పుడు కమల్ హాసన్ రజినీకాంత్ లాగే సూపర్ స్టార్ అని.. కానీ ఆయన ప్రయోగాత్మక చిత్రాలు చేయడం ద్వారా రజినీకాంత్ లాగా ఫాలోయింగ్ పెంచుకోలేక వెనుకబడిపోయాడని వర్మ అన్నాడు. కమల్ చేసిన తప్పులు షారుఖ్ చేయకూడదని.. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని సినిమాలు చేసుకోవాలని సలహా పడేశాడు వర్మ.
అయినా ఇక్కడ రజినీకాంత్ తో పోలిక ఏంటో అర్థం కావడం లేదు. కమల్ రజినీలా మాస్ హీరో కాకపోయినా.. ఆయన స్థాయి ఏంటో.. ఆయనకున్న విలువేంటో.. ఆయన ఎంత గొప్ప గొప్ప సినిమాలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్నటిదాకా మన పవన్ కళ్యాణ్ ను కెలుకుతూ కాలక్షేపం చేసిన వర్మ.. ఇప్పుడు తన బేస్ ముంబయికి మార్చాడు కాబట్టి షారుఖ్ మీదికి ఫోకస్ మార్చినట్లున్నాడు. లేక లేక షారుఖ్ ఏదో మంచి సినిమాల మీద దృష్టిపెడితే ఆ ఆలోచననూ చెడగొట్టాలని ట్రై చేస్తున్నట్లున్నాడు వర్మ. దీనిపై షారుఖ్.. అతడి అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.