Begin typing your search above and press return to search.
రజినీకాంత్ 1.. అమితాబ్ బచ్చన్ 100
By: Tupaki Desk | 15 Jun 2016 4:59 AM GMTపవన్ కళ్యాణ్ అయిపోయాడు.. మహేష్ బాబు అయిపోయాడు.. బన్నీని కూడా ఓ చూపు చూశాడు. మధ్యలో రజినీ మీద కూడా ఫోకస్ పెట్టాడు. షారుఖ్ ఖాన్ ను సైతం వదల్లేదు. ఇప్పుడిక అమితాబ్ బచ్చన్ మీద పడ్డాయి వర్మ కళ్లు. బిగ్-బి కొత్త సినిమా ‘తీన్’ చూసి మెస్మరైజ్ అయిపోయిన వర్మ.. అమితాబ్ ను ఆకాశానికెత్తేస్తూ.. పనిలో పనిగా రజినీకాంత్ గాలి తీస్తూ.. తన మీద తాను కూడా సెటైర్ వేసుకున్నాడు.
ఇంతకీ వర్మ కాన్సెప్ట్ ఏంటంటే.. అమితాబ్ బచ్చన్ అవసరమైతే మాస్ హీరోయిజమూ పండించగలడట. అలాగే ప్రయోగాత్మక చిత్రాల్లోనూ చించేస్తాడట. కానీ రజినీకాంత్ కానీ మరొకరు కానీ ఇలా చేయలేరని అంటున్నాడు వర్మ. ‘తీన్’ సినిమాలో రజినీకంత్ నటించి ఉంటే 1 మార్కు పడేదని.. అదే అమితాబ్ ‘కబాలి’ చేస్తే 100 మార్కులు పడతాయని సెలవిచ్చాడు వర్మ. తాను రజినీకాంత్ కు పెద్ద ఫ్యాన్ అంటూనే అమితాబ్ బచ్చన్ ‘రోబో’లో నటించి ఉంటే ఇంకా చాలా చాలా బెటర్ గా సినిమా ఆడేదని.. కానీ రజినీకాంత్ ‘తీన్’ సినిమా చేస్తే తుస్సుమనేదని అభిప్రాయపడ్డాడు వర్మ.
తీన్.. బ్లాక్.. పీకూ లాంటి సినిమాల్లో రజినీకాంత్ చేస్తే పెద్ జోక్స్ అయ్యేవని.. ఈ విషయంలో రజినీకాంత్ కూడా తన అభిప్రాయాన్ని అంగీకరిస్తాడని వర్మ అన్నాడు. తన అభిప్రాయం మీద రజినీకాంత్ ఆన్సర్ చెప్పాలని కూడా వర్మ డిమాండ్ చేశాడు. భారతీయ సినిమాను ముందుక తీసుకెళ్లడం కోసం అమితాబ్ తన స్టార్ డమ్ వదులుకుని ప్రయోగాలు చేశాడని వర్మ అన్నాడు. తెలుగులో చిరంజీవి.. తమిళంలో రజినీకాంత్ లాంటి వాళ్లు అమితాబ్ ను చూసి నేర్చుకుని మాస్ హీరోలుగా ఎదిగారని.. కానీ అమితాబ్ మాత్రం తన పవర్ ఏంటో తాను తెలుసుకోలేకపోయాడని వర్మ సెలవిచ్చాడు. హీరోయిజం లేని ‘రణ్’ లాంటి సినిమాలు చేయడం అమితాబ్ చేసిన తప్పని వర్మ అన్నాడు. ఆ ‘రణ్’ సినిమా వర్మ దర్శకత్వం వహించిందే కావడం విశేషం.