Begin typing your search above and press return to search.
బాహుబలి ఏనుగు కాదు.. డైనోసార్!!
By: Tupaki Desk | 27 April 2017 4:17 PM GMTఒకప్పటి సెన్సేషనల్ ఫిలిం మేకర్ అయిన రామ్ గోపాల్ వర్మ.. ఈమధ్య తను పెద్ద గొప్పగా సినిమాలు తీయలేకపోయినా.. తను వార్తల్లో నిలించేందుకు తగిన పాయింట్స్ ను మాత్రం బాగానే వెతుక్కుంటున్నాడు. ప్రస్తుతం బాహుబలి2 మూవీ హాట్ టాపిక్ కావడంతో ఆ మూవీని తెగ పొగిడేస్తూ ట్వీట్స్ పెడుతున్నాడు.
ఇప్పటికే రకరకాలుగా బాహుబలి2 ని ఆకాశానికి ఎత్తేసిన వర్మకు.. ఇప్పుడు మళ్లీ కొత్త ఆలోచన వచ్చింది. ఈసారి బాహుబలి2ని ఏకంగా డైనోసార్ తో పోల్చాడు వర్మ. "ఒక ఏనుగు సినిమా వస్తుంటే.. కుక్కల్లాంటి సినిమాలు చాలా మొరుగుతూ ఉంటాయి. కానీ బాహుబలి డైనోసార్ కావడంతో.. కుక్కలు.. పులులు.. సింహాలు అన్నీ దాక్కున్నాయి" అన్నాడు వర్మ. నిజానికి వర్మకు ఇప్పుడీ ఆలోచన వచ్చిందేమో కానీ.. బాహుబలి2 రిలీజ్ అవుతోందని అనేసరికి.. మన దేశంలో ఏ భాషలోనూ ఈ మూవీకి దగ్గరలో సినిమా రిలీజ్ లు ప్లాన్ చేయలేదు.
అత్యంత భారీగా ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి దారి ఇవ్వడంతో పాటు.. ఆ సునామీలో తమ సినిమా కొట్టుకుపోకూడదని జాగ్రత్త పడ్డారు ఫిలిం మేకర్స్. అయితే.. వర్మకు ఎవరో ఒకరిని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేసే అవకాశం దొరికిందని అనిపించినపుడు.. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంటాడంతే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/