Begin typing your search above and press return to search.
వైజాగ్ ని ఇరాక్ అంటున్న వర్మ
By: Tupaki Desk | 26 Jan 2017 10:08 AM GMTరామ్ గోపాల్ వర్మ ప్రతీ అంశాన్నీ విభిన్నమైన కోణంలోంచి చూస్తాడని అనడంలో సందేహం అక్కర్లేదు. ఏ అంశంపై అయినా ఈయన స్పందించే తీరు కారణంగానే ఇలా పేరు తెచ్చుకున్నాడు వర్మ. మొన్నటివరకూ జల్లికట్టుకు వ్యతిరేకంగా ధైర్యంగా ట్వీట్ చేసిన వర్మ.. ఆ తర్వాత టాలీవుడ్ పైకి యాంగిల్ మార్చాడు.
స్పెషల్ స్టేటస్ కి సపోర్ట్ గా నిలిచిన పవన్ ను అభినందించిన వర్మ.. ఆ తర్వాత మహేష్ బాబును ఏకంగా ద్రోహి అనేశాడు. ఇప్పుడు విశాఖ ఆందోళనకు సమయం దగ్గర పడింది. ఈ ఆందోళనను అడ్డుకునేందుకు ప్రభుత్వం గట్టిగానే సన్నాహాలు చేసింది. విశాఖ రామకృష్ణా బీచ్ పరిసర ప్రాంతాలకు వెళ్లే దారులు అన్నిటినీ మూసేసింది. పోలీసులతో పహరా ఏర్పాటు చేసింది. ఎవరినీ అనుమతించబోమని చెప్పి బ్యారికేడ్లు ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతుంటే.. వాటిలో ఒక ఫోటోను పోస్ట్ చేసిన వర్మ.. 'విశాఖను చూస్తుంటే ఇరాక్ మాదిరిగా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.. షాకింగ్' అంటూ ట్వీట్ పెట్టాడు.
విశాఖను ఇలా చూడాల్సి రావడం అందరికీ షాకే అయినా.. ఏకంగా ఇరాక్ తో పోల్చడం అంటే మాత్రం అది టూమచ్. కానీ వర్మకు ఇలాంటి మచ్ లు.. మోర్ లు ఏమీ ఉండవ్ కదా.. అన్నీ ఎక్స్ ట్రీమ్ స్టేజ్ లోనే కనిపిస్తాయ్ మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/