Begin typing your search above and press return to search.
వర్మ పాత్రలో కమల్ దూరాడుగా!
By: Tupaki Desk | 6 Dec 2016 1:14 PM GMTతమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె.జయలలిత మరణంపై రాజకీయ ప్రముఖులతో పాటు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఇక ప్రతి విషయాన్ని వివాదాస్పదం చేస్తూ తనదైన శైలిలో ట్విట్టర్ లో హీట్ పుట్టించే తత్వమున్న బాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా జయ మృతిపై సంతాపం ప్రకటించారు. దాదాపుగా ఎవరిని కూడా మెచ్చుకునే తత్వం లేని వర్మ... ఈ సారి మాత్రం జయపై ప్రశంసలు కురిపించారు. నేటి ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ ను పోస్ట్ చేశారు. జయలలిత లేని తమిళనాడు రాష్ట్రాన్ని ఊహించలేమని ఆయన ఆ పోస్ట్ లో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తాను దర్శకత్వం వహించిన క్షణక్షణం చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడి అవార్డును నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత చేతుల మీదుగా తీసుకున్న ఫొటోను కూడా ఆయన దానికి యాడ్ చేశారు. ఇలా అందరినీ ఏకి పారేస్తూ తనదైన శైలిలో దూసుకువెళుతున్న వర్మ... అమ్మ మృతిపై మాత్రం తన సహజసిద్ధ వైఖరికి భిన్నంగా స్పందించారు. అమ్మను - ఆమె రాజకీయ చతురతను ఆయన ఆకాశానికెత్తేశారు.
ఇక కోలీవుడ్ సీనియర్ నటుడు కమల్ హాసన్ మాత్రం అమ్మ అభిమానులకు ఆగ్రహం తెప్పించారు. జయ మరణం తర్వాత నేటి ఉదయం ఆయన కూడా ట్విట్టర్ లో ప్రత్యక్షమయ్యారు. అమ్మకు సంతాపం తెలిపేందుకంటూ ఆయన పోస్ట్ చేసిన ట్వీట్ ఇప్పుడు తమిళనాట అమ్మ అభిమానులను ఆగ్రహావేశాలకు గురి చేస్తోంది. అయినా కమల్ ఏం ట్వీట్ చేశారంటే... *జయలలితపై ఆధారపడిన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి* అంటూ కమల్ ట్వీట్ చేశారు. ఓ వైపు జయ మరణ వార్త తెలిసి తమిళులంతా శోకసంద్రంలో మునిగి ఉంటే... వారికి ఓదార్చాల్సిన గురుతర బాధ్యత ఉన్న కమల్... జయపై ఆధారపడ్డ వారు అంటూ వ్యాఖ్యలు చేసి కలకలమే రేపారు. కలమ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైరవుతున్నారు. కమల్ తన శాడిజాన్ని మరోమారు బయటపెట్టుకున్నారంటూ నెటిజన్లు ఆయనపై కారాలు మిరియాలు నూరుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/