Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ పై నేను చూపేదే నిజం!-ఆర్జీవీ

By:  Tupaki Desk   |   22 Dec 2018 4:34 PM GMT
ఎన్టీఆర్ పై నేను చూపేదే నిజం!-ఆర్జీవీ
X
గ‌త కొంత‌కాలంగా చ‌డీచ‌ప్పుడు లేని ఆర్జీవీ తిరిగి జూలు విదిల్చాడు. `భైర‌వ‌గీత` ప్ర‌మోష‌న్స్‌ త‌ర్వాత ఈసారి అస‌లు సిస‌లు ప్ర‌చార బ‌రిలో దిగాడు. వ‌స్తూనే త‌న‌దైన మార్క్ తో దూకుడు చూపిస్తున్నాడు. అత‌డు తెర‌కెక్కిస్తున్న `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` రిలీజ్ బ‌రిలో దిగుతున్న సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్ ఊద‌ర‌గొట్టేస్తున్నారు. తాజాగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ప్ర‌చారంలో ఆర్జీవీ ప‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. త్వ‌ర‌లో రిలీజ్ కాబోతున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ లో చూపంచ‌బోయేది అస‌లు నిజం కాదు.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో నేను చూపించ‌బోయేది మాత్ర‌మే అస‌లు నిజం!! అనే అర్థంలో ప‌రోక్షంగా మాట‌ల తూటాలు పేలుస్తూ ఆర్జీవీ ఊద‌ర‌గొట్టేయ‌డం ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌కొచ్చింది.

ఆర్జీవీ మాట్లాడుతూ -``ఏ దేశ‌మేగిన ఎందెందు కాలిడినా పొగ‌డ‌రా నీ త‌ల్లి తెలుగు భార‌తిని. తొలిసారి విన్న‌ప్పుడు క‌లిగే అనుభూతి వేరు. ప్ర‌తి ఒక్క‌రూ ద‌ణ్ణం పెట్టి బ‌తిమాలుకుని ఓట్లు అడుగుతారు.. ఎన్టీఆర్ ఒక్క‌రే రేయ్ అని ఓట్లు అడిగారు. మొద‌టిసారి అలా అడిగింది ఆయ‌నొక్క‌రే. నిజాయితీ వ‌ల్ల‌నే అది సాధ్యం. ఒక మ‌నిషిగా - హీరోగా - నాయ‌కుడిగా ఉన్న ఆయ‌న‌ ఎన్టీఆర్ శ్రీ‌దేవి - జ‌య‌సుధ - జ‌య‌ప్ర‌ద‌ లాంటి అంద‌గ‌త్తెల్ని వ‌దిలేసి - వాళ్ల‌కు ద్రోహం చేసి ల‌క్ష్మీ పార్వ‌తిని పెళ్లి చేసుకోవ‌డ‌మేంటి? అన్న సందిగ్ధ‌త‌ క‌లిగింది. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసేప్పుడు ప‌రిశోధించాను. అస‌లు నిజం ఏంటి? అని వెతికితే.. అయితే ల‌క్ష్మీ పార్వ‌తి గురించి చెప్ప‌గ‌లిగే ఒక ప్ర‌త్య‌క్ష సాక్షి దొరికాడు. ఆయ‌న పేరు ఏంటంటే య‌న్.టి.రామారావు. ఆయ‌న నా క‌ల్లోకి రాలేదు. యూట్యూబ్ ఆయ‌న వీడియో ఒక‌టి చూశాను.. ల‌క్ష్మీ పార్వ‌తి గురించి మాట్లాడిన‌ది. ఆయ‌న కంటే పెద్ద సాక్ష్యం ఎవ‌రూ అవ‌స‌రం లేదు`` అని అన్నారు.

ఎన్టీఆర్ కి కూడా తెలీదు.. ల‌క్ష్మీ పార్వ‌తి ఏంటో. ఎన్టీఆర్ ఫోటోని పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. ఆయన నిజాయితీ కానీ, ఆయ‌న మేధ‌స్సు కానీ - జాతీయ స్థాయిలో ఆయ‌న నుంచి నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉన్న వాళ్లు.. ఆయ‌న‌ ల‌క్ష్మీ పార్వ‌తి వంటి ఒక మామూలు మ‌హిళకు ప్ర‌భావితం అయ్యారని అడిగారంటే.. ఎన్టీఆర్ కి అస‌లు మైండ్ లేద‌నా? ఎన్టీఆర్‌ కి లేని మైండ్ వీళ్ల‌కు ఉంద‌నా? నిజాలు నిరూపించ‌గ‌లిగే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది నా సినిమా. ఇది హిస్టారిక‌ల్. నిజాల వెన‌క నిజాల్ని నేను చెబుతాను. ఆ నిజాల్ని నిరూపించ‌గ‌లిగే ద‌మ్ము ఎవ్వ‌రికీ లేదు. ఇది నా ఛాలెంజ్. ఒక మ‌హానుభావుడిపై ఎంద‌రైనా సినిమా తీయొచ్చు. స్వ‌ర్గ‌లోకంలో ఉన్న ఎన్టీఆర్ మాత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మాత్ర‌మే నిజమ‌ని న‌మ్ముతారు... అంటూ త‌న‌దైన మార్క్ ప్ర‌చారం చేశాడు వ‌ర్మ‌. దీనికి అప్పుడే ఎన్టీఆర్ అభిమానుల నుంచి మీడియా- సామాజిక మాధ్య‌మాల్లో కౌంట‌ర్ మొద‌లైంది.