Begin typing your search above and press return to search.
అఖిల్-వర్మ సినిమా.. నిజ్జంగా
By: Tupaki Desk | 17 May 2018 11:30 PM GMTఅక్కినేని అఖిల్ తో రామ్ గోపాల్ వర్మ సినిమా అనగానే జనాలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. గత పదేళ్లలో వర్మ ట్రాక్ రికార్డు చూసి నాగార్జున అతడితో సినిమా చేయడాన్నే జనాలు జీర్ణించుకోలేకపోయారు. ఈ వార్తనే ముందు నమ్మలేదు. కానీ అదే నిజమైంది. అయితే వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆఫీసర్’ ప్రోమోలు చూస్తే నాగార్జున తప్పులో కాలేశాడన్న అభిప్రాయమే కలిగింది అందరికీ. ఈ చిత్రానికి ఏమాత్రం బజ్ కనిపించలేదు. ‘ఆఫీసర్’ అద్భుతాలు చేస్తుందన్న అంచనాలేమీ లేవు. నాగార్జున కూడా ఈ సినిమా మీద పెద్దగా ఆశలతో ఏమీ లేడని వార్తలొస్తున్నాయి. మరి వర్మతో చేసిన సినిమాపై నాగార్జునే అంత సంతృప్తిగా లేనపుడు.. తన చిన్న కొడుకు అఖిల్ ను వర్మకు అప్పగిస్తాడా అన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి.
కానీ ఇప్పటికే ఒకటికి రెండుసార్లు ఈ సినిమా ఉంటుందని ధ్రువీకరించిన వర్మ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి ఆ విషయాన్ని స్పష్టం చేశాడు. అఖిల్ తో సినిమా కోసం తాను త్వరలోనే స్క్రిప్టు వర్క్ పూర్తి చేయబోతున్నానని.. కొన్ని నెలల తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని చెప్పాడు. ఇదొక క్యాంపస్ డ్రామా అని కూడా వర్మ తెలిపాడు. మరి నాగ్ అండ్ కో ఈ సినిమా విషయంలో ఎలాంటి ఆలోచనతో ఉందో తెలియాలి. శ్రీరెడ్డి ఇష్యూలో వర్మ చేసిన పనితో ఆయనపై ఇండస్ట్రీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రేక్షకుల్లోనూ బాగా వ్యతిరేకత పెరిగింది. ఆ ప్రభావం ‘ఆఫీసర్’ మీద బాగా కనిపిస్తోంది. ఇలాంటి స్థితిలో అసలే కెరీర్ ఏమంత బాగా లేని అఖిల్ ను నాగ్ ఎలా వర్మకు అప్పగిస్తాడో చూడాలి. ఈ విషయంపై ఆయన నుంచి ప్రకటన వచ్చే వరకు నమ్మలేం.