Begin typing your search above and press return to search.

కూతురికి త‌న మార్క్ పంచ్ లిచ్చిన వ‌ర్మ‌

By:  Tupaki Desk   |   16 Oct 2017 5:25 AM GMT
కూతురికి త‌న మార్క్ పంచ్ లిచ్చిన వ‌ర్మ‌
X
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌. అత‌గాడి మాట‌లు కొన్నిసార్లు ఎంత మేధావిత‌నంతో ఉంటాయో.. మ‌రికొన్ని సార్లు అంతే పేల‌వంగా ఉంటాయి. ఎడ్డెం అంటే తెడ్డెం అన్న‌ట్లుగా ఉండే అత‌గాడి తీరు గురించి తెలుగు ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు.

ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడ‌తాన‌నే పేరుతో.. త‌న‌కు తోచింది మాట్లాడే వ‌ర్మ‌.. బ‌య‌ట వాళ్ల‌నే కాదు.. ఇంట్లో వాళ్ల‌ను కూడా వ‌ద‌ల‌ర‌న్న విష‌యం తాజాగా ఆయ‌నిచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పి ఆశ్చ‌ర్యానికి గురి చేశార‌ని చెప్పాలి. త‌న మాట‌ల‌తో పంచ్ ల మీద పంచ్ లు వేసే వ‌ర్మ‌.. త‌న కుమార్తెకు సంబంధించి కొన్ని అంశాల్ని ప్ర‌స్తావించారు. ఆమె డాక్ట‌ర్ అన్న విష‌యం తెలుసు కానీ ఏ బ్రాంచ్ అన్న‌ది తెలీద‌న్నారు.

సాధారణంగా కూతురి ప్రైవ‌సీకి ఏ తండ్రి అయినా చాలా ప్రాధాన్య‌త ఇస్తారు. కానీ.. అందుకు భిన్నంగా కూతురు త‌న‌కు పంపిన ఎక్స‌ర్ సైజ్ ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు వ‌ర్మ‌. దానికి ఆమె ఎలా రియాక్ట్ అయ్యార‌న్న విష‌యాన్ని తాజాగా ఒక ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

ఫోటోను పోస్ట్ చేశాక‌.. మెసేజ్ పెట్టింద‌న్నారు. అందులో.. "ఇట్ ఈజ్ న‌న్ ఆఫ్ యువ‌ర్ బిజినెస్‌.. నీకు ఫోటో పంపిస్తే.. అది బ‌య‌ట ఎలా పెడ‌తావు? అని అంది. కానీ.. నేను ఎలాంటి వాణ్నో తెలిసి కూడా పంప‌టం నీ త‌ప్ప‌ని నేను మెసేజ్ పెట్టా" అని తాను రిప్లై ఇచ్చిన‌ట్లుగా పేర్కొన్నారు.

కూతురికి సంబంధించి మ‌రికొన్ని ప్ర‌శ్న‌ల‌కు బ‌దులిచ్చిన వ‌ర్మ‌.. కుమార్తె పెళ్లికి తాను వెళ్లినా.. తాను గుంపులో ఉన్నానే కానీ స్టేజ్ మీద‌కు వెళ్ల‌లేద‌న్నారు. స్టేజ్ ద‌గ్గ‌ర‌గా ఉండొచ్చు క‌దా అన్న ప్ర‌శ్న‌కు.. అది త‌న ఇష్ట‌మ‌ని.. త‌న‌కు పెళ్లిళ్ల‌న్నా.. ఫ్యూన‌ర‌ల్స్ అన్నా ఇష్ట‌ముండ‌ద‌న్నారు.

ఇక‌.. భార్య గురించి ప్ర‌శ్నించిన‌ప్పుడు.. తాను త‌ర‌చూ మాట్లాడ‌న‌ని.. కానీ హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు క‌లుస్తాన‌న్నాడు. హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు మా ఇంట్లోనే ఉంటుంద‌ని చెప్పారు.