Begin typing your search above and press return to search.

బూతుల్లోకి దిగిన నందుల గోల

By:  Tupaki Desk   |   17 Nov 2017 10:56 AM GMT
బూతుల్లోకి దిగిన నందుల గోల
X
2014 నుంచి 2016 వరకూ మూడేళ్లకు కలిపి ఒకేసారి నంది అవార్డులను ప్రకటించేసింది ఏపీ గవర్నమెంట్. నందులపై ఏటేటా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది కానీ.. ఈ సారి మాత్రం రాద్ధాంతం మరీ ఎక్కువగా ఉంది. ఎంత స్థాయిలో అంటే.. సోషల్ మీడియాలో బూతులు తిట్టుకునే వరకూ కథ వచ్చేసింది.

నంది అవార్డులు ప్రకటించిన కమిటీకి ఆస్కార్ ఇవ్వాలంటూ రాంగోపాల్ వర్మ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇది అవార్డ్ కమిటీలో ఉన్న మద్దినేని రమేష్ బాబుకు అంతగా రుచించలేదు. తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా చెప్పదలచుకున్న ఈయన.. ఘాటైన పదజాలాన్నే ఉపయోగించారు. తను రాయగలిగిన.. తను తిట్టగలిగిన బూతులు అన్నిటినీ తిట్టేస్తూ.. ఓ సుదీర్ఘమైన కామెంట్ ను వర్మపై చేశాడీయన.

ఇంతకీ వీటి సారాంశం ఏంటంటే.. ఎన్టీఆర్ చేతుల మీదుగా నంది అందుకున్నపుడు కామెంట్ చేయకుండా.. ఇప్పుడు చేస్తావేంటి అన్నది ఆయన వెర్షన్. దాన్నే మరీ రాయలేని పదజాలం ఉపయోగించి మరీ తిట్టాడాయన. అంతే కాదు.. వర్మ బతుకును స్పెషల్ గా టీవీకెక్కి మరీ బయటపెడతానని కూడా బెదిరించడం ఆశ్చర్యకరం. అయితే.. ఇవతల ఉన్న పర్సన్ వర్మ అనే విషయం మర్చిపోకూడదు. మద్దినేని పోస్ట్ మొత్తాన్ని కాపీ పేస్ట్ చేసి.. గౌరవనీయులైన కమిటీ సభ్యులు ఇలా చేశారంటూ.. ఆ పోస్ట్ ను మరీ వైరల్ చేసి పడేశాడు.

నంది కమిటీలు ఎలా ఉంటాయో చెప్పేందుకు.. మద్దినేని రమేష్ బాబు ఓ మెతుకు.. మిగతా అన్నం ఎలా ఉందో ఊహించుకోవచ్చంటూ పంచ్ అంటించేశాడు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నది వర్మ లేటెస్ట్ డిమాండ్. చూద్దాం.. నందుల చిత్రాలు ఇంకెన్ని బైటకొస్తాయో!