Begin typing your search above and press return to search.
వంగవీటి రాధాకు వర్మ దిమ్మదిరిగే కౌంటర్
By: Tupaki Desk | 26 Dec 2016 11:59 AM GMT‘వంగవీటి’ సినిమా వివాదాల వేడిలో చలి కాచుకుంటూ రెండు మూడు రోజులు గడిపిన రామ్ గోపాల్ వర్మ.. తనపై తీవ్ర విమర్శలు గుప్పించిన వంగవీటి మోహనరంగా తనయుడు రాధాకు కౌంట్ ఇచ్చాడు. తనపై రాధా కామెంట్లకు సమాధానం అంటూ ఒక ప్రెస్ నోట్ ఇచ్చాడు. అందులో వర్మ తనదైన శైలిలో ప్రశ్నలు సంధించాడు. కొసమెరుపు లాంటి ముగింపు ఇచ్చాడు. ఇంతకీ వర్మ.. రాధాకు సంధించిన ప్రశ్నలు ఏంటంటే..
1. రంగా గారు బోసిపళ్ళ మహాత్మా గాంధీ అని చూపించాలా?
2. మర్డర్ల మాట అటుంచి ఎవర్ని మొట్టికాయ కూడా కొట్టలేదని చూపించాలా?
3. మదర్ థెరిస్సా కన్నా సాత్వికుడు అని చూపించాలా?
4. అన్న దానాలు - ప్రజా సేవ తప్ప చీమకైనా హాని చెయ్యని గౌతమ బుద్దుడని చూపించాలా?
ఇవీ వర్మ ప్రశ్నలు.
ఇక వాస్తవాలే చూపించాల్సిందన్న రాధా డిమాండ్లకు సమాధానం చెబుతూ.. ‘‘రంగా గారి గురించి.. ఆయన భార్య గురించి.. రంగా గారి అభిమానులు వినడానికి చూడటానికి ఇష్టపడని డాక్యుమెంటేడ్ వాస్తవాలు నేను చాలా చూపించగలను. కానీ రంగా గారి మీద వున్న గౌరవంతో అవి చూపించలేదు. ఆ వాస్తవాలు ఏంటని రాధాకు దమ్ముండి డిమాండ్ చేస్తే వాటన్నింటిని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తా. వంగవీటి సినిమా తీయడంలో నా ఉద్దేశం ఆ జీవిత కథల ఆధారంగా అప్పుడు జరిగిన ఆ సంఘటనల వెనుక వాళ్ల సున్నితమైన భావోద్వేగాలని చూపించడం మాత్రమే. ఒరిజినల్ వంగవీటి రాధా - వంగవీటి రంగా గార్లలో ఉన్నగొప్పదనంలో ఈ రాధాకి 0.1% కూడా లేకపోవడం వల్లే ఈ రాధా పరిస్థితి ఇలా వుంది. ఏదీ అర్ధం చేసుకోకుండా మాట్లాడుతున్నాడు. వంగవీటి సినిమా గురించి దుర్భుద్ది ఉన్న వాళ్లు నా దురుద్దేశం గురించి ఎంత అరిచి గీపెట్టినా సరే.. రంగా గారి మీద రాధాకి - రత్నకుమారి గారికి ఉన్న గౌరవం కన్నా ఎన్నో రెట్లు నాకెక్కువ గౌరవముందన్నది వాస్తవం. నేను తీసిన ‘వంగవీటి’ సినిమా కరెక్ట్ కాదనుకుంటే రాధానే ‘అసలు వంగవీటి’ అనే ఇంకో సినిమా తీసి లోకానికి చూపించుకోమనండి’’ అన్నాడు వర్మ. తననేదో చేస్తానన్న రాధా వార్నింగ్ కు కౌంటర్ వార్నింగ్ ఇస్తూ ‘‘బస్తీ మే సవాల్.. సెంటర్ నేను చెప్పను.. టైం నువ్వు చెప్పొద్దు’’ అని వర్మ ముగించడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/