Begin typing your search above and press return to search.
ఆ ఐదుగురు ఎవరు? వాళ్లకే ఎందుకంటే..
By: Tupaki Desk | 27 Nov 2015 5:20 AM GMTరామ్ గోపాల్ వర్మ తన "తుపాకులు & తొడలు"("గన్స్ & థైస్") పుస్తకాన్ని ఓ ఐదుగురికి అంకితం ఇచ్చేశాడు. ప్రమోషన్ విషయంలో ఏం చేస్తే జనాలు అలర్ట్ అవుతారో.. రామూకి పక్కాగా తెలుసు కాబట్టి, అదే యాంగిల్ లో సెలక్ట్ చేసుకున్నాడు. మరి ఆ అయిదుగురి డీటైల్స్ తెలుసుకోవాలి కదా.
వర్మ చెప్పిన మొదటి పేరు అయాన్ రాండ్. ఈవిడ రష్యాలో పుట్టిన అమెరికన్ నవలా రచయిత, నాటక రచయిత, స్క్రీన్ ప్లే రైటర్ కం ఫిలాసఫర్ కూడా. ఈవిడ రాసిన అట్లాస్ ష్రగ్గ్ డ్ అనే 1168 పేజీల పెద్ద నవల బాగా ఫేమస్. ఫిక్షన్ రచనలకు ఇది డిక్షనరీ లాంటిదంటారు ఫిలిం మేకర్స్. అయాన్ రాండ్ రాసిన చాలా బుక్స్ చదివాడు వర్మ
ఇక వర్మ చెప్పిన రెండో పేరు బ్రూస్ లీ. బ్రూస్ లీ అన్నా, ఆయన స్టైల్ యాక్షన్ అన్నా రామూకి చాలా ఇష్టం. శివ నుంచి అనేక సినిమాల్లో బ్రూస్ లీ స్టైల్ ఫైట్స్ ని పెట్టేశాడు. ఆ విషయాన్ని ఓపెన్ గానే చెప్పాడు కూడా. అంతే కాదు.. బ్రూస్ లీ ఇన్ స్పిరేషన్ తో ఇప్పుడో లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా తీస్తున్నాడు.
నెక్ట్స థర్డ్ నేమ్ ఊర్మిళా మండోద్కర్. ఊర్మిళ అంటే ఒకప్పుడు వర్మ సినిమాల్లో పర్మనెంట్ హీరోయిన్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఆ బంధం కొనసాగింది. అసలు వర్మకు హిందీలో క్రేజ్ సంపాదించి పెట్టడంలో ఊర్మిళ అందాలు, గ్లామర్, పెర్ఫామెన్స్ బాగా తోడయ్యాయి. అదే సమయంలో ఆమె కెరీర్ కి వర్మ చేసిన సహాయం చాలానే ఉంది. ఒకరకంగా వీరిద్దరూ కలిసి ఎదిగారు.
ఆ తర్వాత వర్మ చెప్పిన పేరు పోర్న్ స్టార్ ది. టోరీ బ్లాక్ అనే ఈ పోర్న్ తార ఎందుకు నచ్చిందో, పుస్తకాన్ని ఆమెకి ఎందుకు అంకితం ఇచ్చాడో.. ఒక్క రామ్ గోపాల్ వర్మ మాత్రమే చెప్పగలడు. బహుశా.. తనకు ఒకలా కాకపోతే.. ఇంకోలా హెల్ప్ చేసిన వాళ్లు.. అని వర్మ మెన్షన్ చేసింది ఈవిడ గురించే కావచ్చు.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గ్యాంగ్ స్టర్స్. వీళ్లకు ఎందుకు అంకితం ఇవ్వాలో.. వర్మ మూవీస్ చూసే ఎవరైనా చెప్పేయచ్చు. ఈయన సినిమాల్లో లీడ్ రోల్స్ - ఆపోజిట్ కేరక్టర్స్ - విలన్స్.. ఇలా అన్ని కేరక్టర్స్ కి ఇన్ స్పిరేషన్ గ్యాంగ్ స్టర్సే.
ఇలా తనకు బాగా ఉపయోగపడ్డ వారికి తన 'తుపాకులు & తొడలు' పుస్తకాన్ని అంకితం ఇచ్చేస్తున్నట్లు చెప్పాడు వర్మ.