Begin typing your search above and press return to search.

పోర్న్‌ స్టార్‌ కు ఇచ్చావేంటి వర్మా??

By:  Tupaki Desk   |   25 Nov 2015 3:30 PM GMT
పోర్న్‌ స్టార్‌ కు ఇచ్చావేంటి వర్మా??
X
తల్లికో తండ్రికో.. గురువుకో.. దేశానికో.. లేదా వైఫ్‌ కు ఇచ్చినా సరే.. సాధారణంగా చాలామంది పెద్ద పెద్ద నవలా రచయితలు - ప్రముఖ సాహితీవేత్తలు తాము ఏదైనా కొత్త రచన చేస్తే చాలు.. దానిని వెంటనే అలా పైన చెప్పిన వారికి అంకితమిస్తుంటారు. కాని మనం ఎన్నడూ కలవని.. మనకు సంబందం లేని కొత్తవారికి అంకితం ఇవ్వడమనేది చాలా అరుదు.

గన్స్‌ అండ్‌ థైస్‌..అంటూ తన ఆత్మకథను రాసుకున్నాడు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. ఆల్రెడీ పుస్తకం ప్రింటవుతోంది కూడా. మరి ఈ పుస్తకాన్ని ఎవరికి అంకితం ఇస్తున్నాడో తెలుసా? ముంబయ్‌ లోని కొందరు గ్యాంగ్ స్టర్లకు.. ఒక ప్రముఖ పోర్న్‌ స్టార్‌ కు మనోడు ఈ ఫిలింని అంకితమిస్తున్నాడట. అప్పట్లో మనోడు టోరీ బ్లాక్‌ అనే ప్రఖ్యాత పోర్న్‌ స్టార్‌ తో ఒక సినిమా తీస్తున్నాడని వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశాడు వర్మ. ఒకవేళ వర్మ ఆటోబయోగ్రాఫీ పుస్తకంను సదరు పోర్న్‌ స్టార్‌ కు అంకితమిచ్చుంటాడేమో. ఆ పేజీలను చూసే అప్పట్లో మనోళ్లు టోరీ బ్లాక్‌ తో సినిమా తీస్తున్నాడని పొరబడ్డాడేమో.

ఇప్పటికే కొందరు మీడియా పెద్దలకు వర్మ తన ఆటోబయోగ్రాఫీ కాపీలను అందించాడు. వాటిని చూసిన చాలామంది పోర్న్‌ స్టార్‌ కు అంకితం ఇచ్చిన మాట వాస్తవమే అన్నారు కాని.. ఆ పేరు మాత్రం రివీల్‌ చేయలేదు.