Begin typing your search above and press return to search.

సుశాంత్ కి కాదు క‌ర‌ణ్ కి ఆర్జీవీ స‌పోర్ట్ ఏంటో

By:  Tupaki Desk   |   17 Jun 2020 6:10 AM GMT
సుశాంత్ కి కాదు క‌ర‌ణ్ కి ఆర్జీవీ స‌పోర్ట్ ఏంటో
X
లోకులంతా ఒక వైపు ఉంటే తాను ఒక్క‌డే మ‌రో వైపు ఉంటానంటాడు ఆర్జీవీ. ఇప్పుడు సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం బాలీవుడ్ లో నెప్టోయిజం.. బంధుప్రీతి.. ఫేవ‌రిజం.. మాఫియా ఆట‌లు అంటూ జ‌నం తిట్టి పోస్తుంటే ఆర్జీవీ మాత్రం తాపీగా అవేవీ కార‌ణాలు కావ‌ని ఖండించడం హాట్ టాపిక్ గా మారింది. అంతేనా.. ప్ర‌తిసారీ క‌ర‌ణ్ జోహార్ తో కామెడీలు చేస్తూ ఆట‌లాడుకునే ఆర్జీవీ ఈసారి అత‌డికి మ‌ద్ధ‌తు ప‌లికాడు. సుశాంత్ మ‌ర‌ణానికి క‌ర‌ణ్ ని నిందించ‌డం స‌రికాద‌ని ఆర్జీవీ వ‌త్తాసు ప‌లికారు. సైఫ్ అలీఖాన్ త‌ర్వాత పూర్తి ఆపోజిట్ వెర్ష‌న్ వినిపించింది ఆర్జీవీ మాత్ర‌మే.

ప్ర‌తి ఒక్క‌రూ ఇన్ సైడ‌ర్ అంటూ క‌ర‌ణ్ జోహార్ ని తిట్టేస్తుంటే అత‌డు ఇన్ సైడ‌ర్ ఏమిటి ఔట్ సైడ‌ర్ అంటూ క్లారిటీనిచ్చారు ఆర్జీవీ. క‌ర‌ణ్ .. అమితాబ్ ఇద్ద‌రూ బ‌య‌టి నుంచి వ‌చ్చి స్థిర‌ప‌డిన వారేన‌ని వ‌ర్మ అన్నారు. సుశాంత్ సింగ్ ఇప్ప‌టికే స్టార్ అయ్యాడు. మ‌రో ప‌దేళ్లు ఇక్క‌డే ఉంటే ఇన్ సైడ‌ర్ అయ్యేవాడు. అప్పుడు అత‌డి వార‌సులు పరిచ‌యం అయితే ఇలానే ఇన్ సైడ‌ర్ అనేవారా? అంటూ ప్ర‌శ్నించారు.

కొన్ని వ‌రుస ట్వీట్ల‌తో ఆర్జీవీ ఇచ్చిన వివ‌ర‌ణ‌లో ఎక్క‌డా లాజిక్ అన్న‌దే మిస్ కాక‌పోవ‌డం ఆస‌క్తిక‌రం. ఇన్ ‌సైడర్ అనే కారణంతో లక్షలాది జ‌నం వీళ్ల‌ సినిమాలు చూశారంటే సరికాదు. సినీ ప‌రిశ్ర‌మ‌ల్ని శాసించే పెద్ద ఫ్యామిలీలకు అవుట్ సైడర్స్ తీసిన సినిమాల కంటే ఎక్కువగా ప‌రాజ‌యాలు ఎదురయ్యాయ‌ని వ‌ర్మ అన్నారు.

సుశాంత్ కూడా తన వార‌సుడితో 15 ఏళ్లు ప‌రిశ్ర‌మ‌లో ఉంటే.. కరణ్ జోహర్ మాదిరిగా సుశాంత్ ‌ను టార్గెట్ చేసేవారేమో! అంటూ సందేహం వ్య‌క్తం చేశారు వ‌ర్మ‌. సుశాంత్ ని బ‌య‌టికి పంపించేవాళ్లెంద‌రు అన్న‌ది కాదు.. అత‌డితో ఎంద‌రు ప‌ని చేయాల‌ని రెడీగా ఉన్నారు? అన్న‌దే ఇంపార్టెంట్ అని విశ్లేషించారు. కనీసం సుశాంత్ బాలీవుడ్‌ లాంటి చంద్రుడిని తాకాడు. మరికొందరు కనీసం ఎలాంటి ఛాన్స్ దొర‌క్క‌ భూమి పైనే ఉండి పోయారు. ఇలాంటోళ్లంతా ప‌రిశ్ర‌మ‌ను తిట్టుకుని ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవాలా? అని ఆర్జీవీ ప్ర‌శ్నించారు. మ‌ర‌ణించాక ర‌చ్చ చేస్తున్న వాళ్లంతా సుశాంత్ మ‌ర‌ణానికి 48 గంట‌ల ముందు ఎందుకు స్పందించ‌లేద‌ని వ‌ర్మ చీవాట్లు పెట్టారు. సుశాంత్ సూసైడ్ తర్వాత కరణ్ జోహర్ ను టార్గెట్ చేయడం సమంజ‌సం కాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రేక్ష‌కులే అన్నిటికీ స‌మాధాన‌మిస్తారు. క‌ర‌ణ్ ని పెద్ద‌ వాడిని చేసింది ప్రేక్ష‌కులే. ఇన్‌సైడర్, అవుట్ సైడర్ల భవిష్యత్ ‌ను తేల్చేది ప్రేక్షకులేనని ఆర్జ‌వీ నిష్క‌ర్ష‌గా అన్నారు.