Begin typing your search above and press return to search.
ట్రంప్ విన్.. రామ్ గోపాల వర్మ పండగ
By: Tupaki Desk | 9 Nov 2016 9:02 AM GMTఅమెరికా సంయుక్త రాష్ట్రంల 45వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ను అక్కడి ప్రజలు ఎన్నుకున్నారు. మస్లింలను దేశంలోకి రానివ్వను అనడం.. అసలు బిజినెస్ ఈక్వేషన్లు మార్చాలి అనడం.. మెక్సిన్ బోర్డర్ పొడుగునా గోడ కట్టేస్తాను.. పైగా ఆ గోడకు మెక్సికోతో డబ్బులు కట్టిస్తాను అనడం.. ఇవన్నీ ట్రంప్ ఒక బఫూన్ అనే టైపులో చిత్రీకరించేలా మీడియా కూడా సహాయం చేసింది. కాని రామ్ గోపాల్ వర్మ వంటి కొందరు సెలబ్రిటీలు మాత్రం ఆయన్ను తెగ అభిమానించేశారు. అందుకే ఇప్పుడు పండగ చేసుకుంటున్నాడు.
''నాలుగు నెలల క్రితమే ట్రంప్ గెలుస్తాడని నేను చెప్పాను. అందుకే నాకు నేనే థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈరోజు రాత్రికి అందరికీ పెద్ద పార్టీ ఇవ్వబోతున్నాను. ట్రంప్ ను నాన్ సెన్స్ అనుకున్నవారందరూ ఇప్పుడు వారే నాన్ సెన్స్ మాట్లాడారని అనుకోవచ్చు మనం'' అంటూ పండగ చేసుకుంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. పైగా మనోడు ఇంకొక లాజిక్ కూడా చెప్పాడండోయ్. అదేంటంటే.. ''ఇప్పుడు ట్రంప్ గెలిచిన స్థానాలన్నీ ఒకప్పుడు ఒబామా గెలిచిన స్థానాలే. అంటే ట్రంప్ కేవలం హిల్లరి క్లింటన్ నే కాదు.. ఒబామాను కూడా ఓడించేశాడు'' అంటున్నాడు రాము.
ఏదేమైనా కూడా.. తను సినిమాల విషయంలో ఫెయిలైనా కూడా ఇక్కడ ఈ ప్రెడిక్షన్లో సక్సెస్ అయినందుకు చాలా ఆనందపడుతున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/