Begin typing your search above and press return to search.
స్టేజ్ ఊడ్చేటోడ్ని వర్మ స్టార్ డైరెక్టర్ని చేశాడు
By: Tupaki Desk | 26 Oct 2016 1:30 PM GMTవర్మ పేరు చెప్పినంతనే వివాదాలు గుర్తుకు వచ్చేస్తాయి. మనసులోని మాటను ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తారన్న ఇమేజ్ తో పాటు.. రౌడీలకు రౌడీగా.. గూండాలకు గూండాగా ఆయన తీరు ఉంటుంది. వివాదాలతో సహజీవనం చేస్తున్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. ఎప్పుడూ.. ఎక్కడా.. ఎలాంటి పరిస్థితుల్లోనూ భావోద్వేగానికి గురి కానట్లుగా కనిపించే వర్మకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఒక స్టార్ డైరెక్టర్ చెప్పకనే చెప్పేయటం కనిపిస్తుంది.
వర్మ ప్రస్తావన ఆయన తెచ్చింది తక్కువే అయినా.. టాలెంట్ ను గుర్తించి.. వారికి అవకాశం ఇచ్చే తీరులో వర్మలో ఎక్కువన్న విషయం మరోసారి ఆయన మాటలతో అర్థమవుతుంది.
ఎలాంటి సినిమా నేపథ్యం లేకున్నా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అనురాగ్ కశ్యప్. అతడి పేరే ఒక బ్రాండ్ గా చెబుతుంటారు. మరి.. అంతటి స్టార్ డైరెక్టర్ కు లైఫ్ ఇచ్చింది.. బ్రేక్ ఇచ్చింది వర్మేనని చెప్పాలి. ఆ విషయం ఎవరో చెప్పటం కాదు.. అనురాగ్ కశ్యపే చెప్పుకొచ్చారు. బాలీవుడ్ లో రచయితగా.. నిర్మాతగా.. డైరెక్టర్ గా పేరున్న కశ్యప్ కు ముంబయికి వచ్చిన కొత్తల్లో అవకాశాలు ఇచ్చే సంగతి తర్వాత.. ఆయన మాటల్ని కూడా ఎవరూ వినేవారు కాదట. డిగ్రీ చదివే రోజుల్లో సైంటిస్ట్ కావాలనుకున్న ఆయన.. అందులో భాగంగా ఎవరితోనూ పరిచయం లేకున్నా ముంబయికి వచ్చేశాడట.
ఏం చేయాలో తెలీక పృథ్వీ థియేటర్ లో స్టేజ్ ఊడ్చే పని చేసేవాడినని.. ఆ టైంలో బాగా స్క్రిప్ట్ రాయటంలో ఉన్న పట్టుతో దాని మీద ఫోకస్ చేశాడట. రోజులో వంద పేజీలు అలవోకగా రాసేవాడట. సీరియళ్లకైతే ఫ్రీగా రాసిచ్చేవాడట. అయినా.. అతన్ని వాడుకోవటమే కానీ.. క్రెడిట్ మాత్రం ఇచ్చేవారు కాదట. తొలిసారి సత్య సినిమాకు పని చేసిన సమయంలో నేమ్ కార్డులో కశ్యప్ పేరు వేయడంతో అతడి టాలెంట్ బయట ప్రపంచానికి తెలీటమే కాదు.. అతన్ని అందరూ అభినందించారట. అలా తొలిసారి స్క్రీన్ మీద పేరు పడ్డాక కశ్యప్ ఎంతటి వాడు అయ్యాడో తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/