Begin typing your search above and press return to search.

అందుకే జనవరి 24: రామ్ గోపాల్ వర్మ

By:  Tupaki Desk   |   20 Oct 2018 5:25 AM GMT
అందుకే జనవరి 24: రామ్ గోపాల్ వర్మ
X
నందమూరి బాలకృష్ణ - క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. మొదటి భాగం 'కథానాయకుడు' జనవరి 9 న రిలీజ్ అవుతోంది. రెండవ భాగం 'మహానాయకుడు' ను జనవరి 24 న రిపబ్లిక్ డే వీకెండ్ సందర్భంగా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. సరిగ్గా ఈ జనవరి 24 డేట్ పైనే మన రామ్ గోపాల్ వర్మ కన్నుపడింది.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని జనవరి 24 న విడుదల చేస్తామని ప్రకటించడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. 'మహానాయకుడు' డేట్ ను ఇప్పుడు మార్చడం వీలు కాదు.. ఒకవేళ మార్చినా నవ్వులపాలయ్యే అవకాశం ఉంది. 'మహానాయకుడు' సినిమా ఎన్టీఆర్ రాజకీయ జీవితం చుట్టూ తిరుగుతుంది. అయన పొలిటికల్ ఎంట్రీ నుండి మొదలుపెట్టి 1989 వరకూ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. దీంతో.. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో సగం మాత్రమే.. అది కూడా వివాదాస్పదం కానివి మాత్రమే చూపిస్తారని చిన్న పిల్లాడిని అడిగినా వెంటనే చెప్పేస్తాడు. ఇక 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మాత్రం టైటిల్ కి తగ్గట్టే ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీ పార్వతి ఆయన జీవితం లో కి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఎన్టీఆర్ చివరి రోజుల వరకూ ఉంటుంది. పైగా వర్మ.. 'అసలు కథ'.. 'పెద్దాయన ఆశీస్సులు మా సినిమాకే ఉంటాయి' అని చెబుతుండడంతో ఇది ఖచ్చితంగా 'మహానాయకుడు' సినిమాకు పోటీగా రిలీజ్ చేస్తున్నారనే భావన అందరిలో నెలకొంది.

కానీ వర్మ మాత్రం అలాటిదేమీ లేదంటున్నాడు.. "మేము 24 వ తేదీ అనుకోవడానికి వేరే కారణం లేదు. మా సినిమా నిర్మాత రాకేష్ రెడ్డిగారి అబ్బాయి పుట్టిన రోజు జనవరి 24. అందుకే ఆ డేట్ లాక్ చేయడం జరిగింది" అన్నాడు. వర్మగారు చెప్పేది చెప్పారు. నమ్మినవాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు అంతే కదా.

పైగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ను ఎన్టీఆర్ పై తనకున్న ప్రేమతో చేస్తున్నానని ఎవరు నమ్మినా.. నమ్మకపోయినా పొలిటికల్ యాంగిల్స్ ఉండని తన పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పే సినిమా అంటున్నాడు. ఎన్టీఆర్ పై ఎన్ని బయోపిక్కులు వచ్చినా అయన ఆశీర్వాదం మాత్రం తమకే ఉంటుందని అన్నాడు. ఇక ఈ సినిమా తీస్తున్నందుకు బెదిరింపులు ఉంటాయేమో అని అడిగితే "సినిమా డిజిటల్ స్పేస్ లోకి వెళ్తోంది. సింగిల్ హ్యాండ్ తో ఎవరూ ఒక సినిమా రిలీజ్ ను అడ్డుకోలేరు" అన్నాడు. సహజంగా సంక్రాంతి ఫోకస్ అంతా జనవరి 15 లోపు రిలీజ్ అయ్యే సినిమాలపై ఉంటుంది.. ఇప్పుడు 24 కు ఫోకస్ షిఫ్ట్ అయ్యేలా చేశాడు గురుడు.. రాబోయే రోజుల్లో మరింత హంగామా ఖాయంలా అనిపిస్తోంది.