Begin typing your search above and press return to search.

అమ్మాయి కాళ్లు నాక‌డం వ‌ర్మ‌కి ఓ పిచ్చి!

By:  Tupaki Desk   |   2 March 2023 5:57 PM GMT
అమ్మాయి కాళ్లు నాక‌డం వ‌ర్మ‌కి ఓ పిచ్చి!
X
రాంగోపాల్ వ‌ర్మ ఏప‌ని చేసినా అది సంచ‌ల‌నమ‌ని చాలాసార్లు రుజువైంది. కొత్త‌గా ఆ పెను సంచ‌ల‌నం గురించి సరికొత్త‌గా చెప్పాల్స‌ని ప‌నేం లేదు. ఏ వివాదం లేక‌పోతే? ఆయ‌నే త‌న‌దైన శైలిలో ఏదో వీడియోతో మీడియా అటెన్ష‌న్ డ్రా చేస్తుంటారు. దానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో చేసి సామాజిక మ‌ధ్య‌మాల్లో వదిలి వర్మ పేరు మారుమ్రోగేలా చేస్తుంటారు.

ఆ మ‌ధ్య వ‌ర్ధ‌మాన న‌టి అషురెడ్డి కాళ్లు పాదాలు..కాళ్లు జుర్రేసిన వీడియో నెట్టింట వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. అంత పెద్ద డైరెక్ట‌ర్ న‌టి కాళ్లు నాక‌డం ఏంట‌ని అభిమానులు కాస్త ఫీల‌య్యారు. కానీ వ‌ర్మ మాత్రం ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఆప‌నిని ఆస్వాదించారు. తాజాగా ఇదే విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నించ‌గా వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

`నాకు అమ్మాయిల‌న్నా..వాళ్ల కాళ్లు నాక‌డ‌మ‌న్నా ఇష్టం. ఎవ‌రో? ఏదో ? అనుకుంటార‌ని నా ప‌ని మానేయ‌ను. అలాంటి వాళ్ల‌ను నేను అస్స‌లు ప‌ట్టించుకోను. మీరు వేసుకున్న పింక్ డ్రెస్ నాకు న‌చ్చ‌లేదు. కానీ ఆ విష‌యం చెప్ప‌డానికి నేను ఎవ‌రు? అది మీ ఇష్టం. మీకు న‌చ్చిన రంగు డ్రెస్ వేసుకుంటారు. ఆ హ‌క్కు మీకుంది. మీ హ‌క్కును కాద‌న‌డానికి నాకు రైట్ లేదు.

అలాగే నా ఇష్టం అమ్మాయిల కాళ్లు నాకుతాను. ఇంకేదైనా చేస్తాను. అడ‌గడానికి ఎవ‌రికీ రైట్ లేదు. నేను మీ డ్రెస్ మీద కామెంట్ చేస్తే మీకు ఎలా ఉంటుంది? నామీద కామెంట్ చేస్తే నాకు అలాగే ఉంటుంది. ఎవ‌డో ఏదో అనుకుంటాడ‌ని ఆ ప‌ని చేయ‌డం మానేయ‌ను. నా మ‌న‌సుకు న‌చ్చి ప‌ని చేసుకుంటూ వెళ్లిపోతాను` అని అన్నారు. అలాగే పెళ్లి గురించి కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

`నాదృష్టిలో ప్రేమ‌ను చంపేసేదే పెళ్లి. ఇద్ద‌రిలోనూ ఒక‌రిప‌ట్ల ఒక‌రికి ప్రేమ అనేది త‌గ్గుతూ వ‌స్తుంటుంది. అందువలన పెళ్లి అనేది చావుకు ముందు వచ్చే చావులాంటిదని అని గ‌ట్టిగా చెప్ప‌గ‌ల‌ను. పెళ్లి చేసుకోని వాడు ప్ర‌తీ ఒక్క‌డు హ్యాపీగా ఉంటాడు. అలాగ‌ని అన్ని తెలిసి మీరెందుకు పెళ్లి చేసుకున్నారు? అనొచ్చు. అప్పుడు తెలియ‌క చేసుకున్నాను..తెలిసాక వ‌దిలేసాను. వ‌దిలేసాక చాలా జ్ఞానం సంపాదించాను ` అని అన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.