Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ అయిపోయాడు.. ఇప్పుడు కేసీఆర్

By:  Tupaki Desk   |   18 April 2019 2:41 PM IST
ఎన్టీఆర్ అయిపోయాడు.. ఇప్పుడు కేసీఆర్
X
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో కావాల్సినంత కాంట్రవర్సీని సృష్టించాడు. వివాదాలు లేనిదే నిద్రపోని వర్మ.. ఇప్పుడు తాజాగా కేసీఆర్ పై పడ్డారు. చెప్పినట్టుగానే తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ ను మొదలుపెట్టాడు. అందుకు సంబంధించిన ప్రకటనతోపాటు టైటిల్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసి అందరికీ షాకిచ్చారు.

తాజాగా వర్మ తన ట్విట్టర్ ఖాతాలో కేసీఆర్ టైగర్ అని సెట్ చేసిన టైటిల్ ను సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. దానికింద కేసీఆర్ డైలాగును కూడా గట్టిగా పెట్టి పంచ్ ఇచ్చాడు. ‘ఆడు తెలంగాణ తెస్తానంటే.. అందరూ నవ్విండ్రు’ అని కేసీఆర్ డైలాగ్ నే పెట్టడంతో ఈ న్యూస్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇక వర్మకు టైటిల్స్ వదలడం కొత్తేమీ కాదు.. గతంలో కూడా చాలా మంది ప్రముఖుల బయోపిక్స్ తీస్తానని పోస్టర్ లతో హంగామా సృష్టించి హల్ చల్ చేశాడు. అందులో చాలా వరకూ తెరకెక్కలేదు.

అయితే కేసీఆర్ బయోపిక్ పై మాత్రం వర్మ మొండిపట్టుదలతో ఉన్నాడని సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి జీవితాన్ని వర్మ ఎలా ఆవిష్కరిస్తారు? రాజకీయంగా ఆయన ఒడిదుడుకుల్ని ఎలా తెరపై చూపిస్తాడన్నది మాత్రం వేచిచూడాల్సిందే.