Begin typing your search above and press return to search.
స్మగ్లింగ్ కింగ్ కు క్రేజ్ మొదలైంది
By: Tupaki Desk | 5 Nov 2015 1:30 AM GMTవివాదాస్పద చిత్రాలను ఎలా తీయాలో.. ఎలా ప్రమోట్ చేసుకోవాలో రామ్ గోపాల్ వర్మకు తెలిసినంతగా ఎవరికీ తెలియదనే చెప్పాలి. ప్రస్తుతం వర్మ తీస్తున్న బయోపిక్ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ది. కిల్లింగ్ వీరప్పన్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రానికి.. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయిపోయింది.
నవంబర్ 20న కిల్లింగ్ వీరప్పన్ ను గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నాడు వర్మ. మొదటి ట్రైలర్ ను వీరప్పన్ చెరనుంచి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ విడుదల రోజున, రెండో ట్రైలర్ ను వీరప్పన్ ను చంపేసిన రోజున రిలీజ్ చేసి.. కర్నాటక అంతటా తన మూవీ గురించి మాట్లాడుకునేలా చేయడంలో వర్మ బాగానే సక్సస్ అయ్యాడు. మరో రెండువారాల్లో రిలీజ్ కానున్న కిల్లింగ్ వీరప్పన్ పై కన్నడ ఇండస్ట్రీలో భారీ అంచనాలే నెలకొన్నాయి. వీరప్పన్ ను మట్టుపెట్టేందుకు నియమితుడైన స్పెషల్ ఆఫీసర్ రోల్ ను పునీత్ రాజ్ కుమార్ పోషిస్తుండగా.. వీరప్పన్ పాత్రను ఢిల్లీ స్టేజ్ ఆర్టిస్ట్ సందీప్ భరద్వాజ్ చేస్తున్నాడు.
నిజానికి ఏ మాటకు ఆ మాటే చెప్పాలంటే.. వర్మ తీసిన ఈ సినిమా పాటలన్నీ చాలా బాగున్నాయి. కంపోజింగ్ నుండి స్ర్కీన్ ప్లే వరకు అన్నీ చాలా అద్భుతంగానే తడుతున్నాయి. కాకపోతే మనోడు ట్రైలర్ లో కనిపించింది మాత్రమే కాకుండా ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా తీస్తే మాత్రం సినిమా హిట్టయ్యే ఛాన్సుంది. అదర్ వైజ్.. తూర్పు టర్న్ కరో.. దణ్ణం షురూ కరో.. అన్నట్లుంటుంది పరిస్థితి.