Begin typing your search above and press return to search.
వర్మ వెలుగుల దుమారం.. సిగరెట్ తో అంటించాడు
By: Tupaki Desk | 6 April 2020 10:30 AM GMTవివాదాలు లేనిదే పొద్దు గడవని దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు తన పైత్యాన్ని రంగరించి.. వివాదాస్పందంగా దీపం వెలిగించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజాగా ప్రధాని నరేంద్రమోడీ కరోనాపై పోరాడుతున్న వారికి సంఘీభావంగా ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చాడు. దీన్ని దేశ ప్రజలు, రాజకీయ నేతలు, ప్రముఖులు పాటించి ఘనంగా నిన్న రాత్రి దీపాలు వెలిగించారు.
అయితే తనను తాను క్రియేటివ్ జీనియస్ గా భ్రమించే రాంగోపాల్ వర్మ ఈ దీపాలు అంటు పెట్టడంలోనూ క్రియేటివ్ గా ఆలోచించాడు. అయితే అది పెద్ద వివాదానికి దారితీసింది. చేయాల్సిన పనిచేయకుండా వింతగా చేసిన వర్మ ఇప్పుడు అందిర చేత తిట్లు తింటున్నాడు.
తాజాగా నిన్నరాత్రి వర్మ లైట్స్ ఆఫ్ చేసి సిగరేట్ నోట్లో పెట్టుకొని లైటర్ తో దీపాలు వెలిగించాడు. మోడీ చెప్పినట్టు తాను కూడా దీపం వెలిగించానని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇది పెద్ద దుమారం రేపింది. సిగరెట్ ముట్టించి దీపాలంటావేంటి? అని అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు.. ఓ రమ్మా బడవా.. ఇలా అంటిస్తావా అని అందరూ తిట్టపోస్తున్నారు. ఇలా కూడా దీపాలు అంటించవచ్చా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.