Begin typing your search above and press return to search.
లైవ్ లో వోడ్కా కొడుతుంటే వినోదం చూడాలా!
By: Tupaki Desk | 29 Dec 2019 9:33 AM GMTవివాదాల ఆర్జీవీ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. వర్మ శైలి ఆర్భాటం గురించి తెలియనిది ఎవరికి. ఏ వేదికనూ వదలని ఘనాపాటి. ఈసారి న్యూఇయర్ వేడుకల్ని కూడా వదలడట. ప్రియ శిష్యుడు అగస్త్య మంజు తెరకెక్కించిన `బ్యూటిఫుల్` ప్రచారాన్ని ఆర్జీవీ ఇప్పటికే ఊదరగొట్టేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త వాళ్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అందుకే వర్మ బ్యాక్ బోన్ గా ఉండి కావాల్సిన బూస్ట్ ఇస్తున్నాడు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 వేడుకలకు ముందుగానే ` ఓ పేరు పెట్టి పబ్లిక్ అందరినీ మందు కొట్టేందుకు ఆహ్వానించాడు ఆర్జీవీ.
`బ్యూటిఫుల్ ప్రీ న్యూయర్ పార్టీ` అంటూ రచ్చ లేపుతున్నాడు. ఆర్జీవీ.. నైనా గంగూలీ.. పార్థ సూరి .. అగస్త్య మంజు ఎవరితో అయినా మీరు రెడీనా! అంటూ పబ్లిక్ ని పార్టీకి పిలిచేసాడు. ఈరోజు రాత్రి 8.45 నిమిషాలకు పార్టీ స్టార్ట్ అవుతుంది. అందరూ జాయిన్ అవ్వొచ్చు అని పిలుపునిచ్చాడు.
ఇంతకీ వేదిక ఎక్కడ అనుకున్నారు? ఏ నోవోటెల్ నో.. తాజ్ కృష్ణనో అనుకునేరు! అలా ఆశపడితే బోల్తా కొట్టినట్లే. ఇన్ స్టాగ్రమ్- ఫేస్ బుక్ లైవ్ లో అంటూ బాంబు పేల్చారు. అంటే ఎవరికి కావాల్సిన డ్రింకులు వారి డబ్బుతోనే కొనుక్కోవాలి. అనంతరం యూనిట్ అంతా లైవ్ స్ట్రీమింగులోకి వస్తారు. వాళ్లతో మాట్లాడుతూ పార్టీని ఎంజాయ్ చేయాలన్న మాట. అంటే వర్మ బృందానికి రూపాయి ఖర్చు లేకుండా కామన్ ఆడియన్ పర్స్ ఖాళీ అయ్యే మాస్టర్ ప్లాన్ ఇది. మరి వర్మ ఆహ్వానాన్ని ఎంత మంది కాదనలేరో చూడాలి.