Begin typing your search above and press return to search.
తేల్చుడే అంటున్న ఆర్జీవీ.. ?
By: Tupaki Desk | 8 Jan 2022 8:30 AM GMTటాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. షార్ట్ కట్ లో ఆర్జీవీ తన వ్యవహారశైలికి భిన్నంగా ఎన్నడూ మోయని ఒక అతి పెద్ద భారాన్ని తానుగా మోస్తున్నారు. నిజానికి వర్మకు ఏదైనా ఇష్యూనే. ఈ భూగోళం మీద ఏ సమస్య ఉన్నా దాన్ని తనదైన ధోరణిలో చూస్తూ లాజికల్ గా ఎప్పటికప్పుడు రియాక్ట్ అవడం వర్మ స్పెషాలిటీ.
ఆర్జీవీ తెలివి తేటల మీద ఎవరికీ తక్కువ అంచనాలు లేవు. ఆయన విషయ పరిజ్ఞానాన్ని కూడా ఎవరూ తేలిక చేసి మాట్లాడలేరు. అందుకే వర్మ వర్సెస్ అంటే అవతల వారు దాన్ని పెద్దగా సాగదీయరు. అలాంటి వర్మ ఇపుడు ఏకంగా ప్రభుత్వంతోనే పెట్టుకున్నారు. ఒక అతి పెద్ద వ్యవస్థనే ఆయన ఢీ కొట్టారు.
నిజానికి సినిమా టికెట్ల సమస్య ఇప్పటికి తొమ్మిది నెలలుగా నలుగుతోంది. ఆ మధ్యన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో చాలా హాట్ హాట్ గా రియాక్ట్ అయ్యారు. నాటి నుంచి మెల్లగా రాజుకుంటూ వచ్చింది ఈ ఇష్యూ. ఇక లేటెస్ట్ గా వర్మ ఇందులోకి దిగిపోయారు. ఆయన అ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ మంత్రి పేర్ని నానికే ఒక్కసారిగా గురి పెట్టారు. అటు నుంచి కూడా నాని రియాక్ట్ కావడంతో ఈ ట్వీట్ల సమరం పీక్స్ కి చేరింది.
అయితే ఇది ఇలాగే సాగి చప్పబడిపోతుంది అని అంతా అనుకున్నారు. వర్మ కూడా ట్వీట్లకే పరిమితం అవుతారు అని కూడా అంతా భావించారు. కానీ ట్విస్ట్ ఏంటి అంటే వర్మ తనకు ఒక్క చాన్స్ ఇస్తే సినీ రంగం సమస్యల మీద ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో వివరించి వారిని ఒప్పిస్తాను అన్న ట్వీట్ కి మంత్రి పేర్ని నాని పాజిటివ్ గా స్పందించడం. అలాగే వర్మ గారు మనం కలుద్దామని పేర్ని నాని చెప్పారు. అయితే కూడా క్యాజువల్ గా అని ఉంటారనే అనుకున్నారు.
కానీ సినిమా మంత్రి కూడా ఎక్కడా తగ్గలేదు. ఆయన చెప్పిన మాటకు కట్టుబడి ఈ నెల 10న వర్మకు అపాయింట్మెంట్ ఇచ్చారు. వర్మ ట్వీట్ ద్వారానే ఈ సంగతి తెలిసింది. తాను వెళ్తున్నట్లుగా కూడా వర్మ చెప్పుకున్నారు. మొత్తానికి చూస్తే టాలీవుడ్ నుంచి పెద్దగా వర్మ అటెండ్ కావడం ష్యూర్. మరి వర్మ ప్రభుత్వం తో ఏం మాట్లాడుతారు, ఎలా ఒప్పిస్తారు అన్నదే ఇక్కడ చర్చగా ఉంది.
వర్మ అంటే లాజిక్కులకు పెట్టింది పేరు, ఆయన వేలికీ కాలికీ పెట్టి మరీ తన వాదనను అవతల వారు ఒప్పుకునేలా చేయడంతో స్పెషలిస్ట్. అలాంటి వర్మ ఇప్పుడు ప్రభుత్వంతో చర్చలకు వెళ్తున్నారు కాబట్టి కచ్చితంగా దీనికి సానుకూల స్పందన ఉంటుంది అని అంతా అనుకుంటున్నారు. మరో వైపు వర్మ తాను జగన్ కి పెద్ద ఫ్యాన్ ని అంటున్నారు. ఆయన ఈ ఒక్క ఇష్యూ తప్ప మరే విషయంలో కూడా వైసీపీతో పొలిటికల్ గా విభేదించిన సందర్భం ఎక్కడా లేదు.
అది కూడా ఈ చర్చలు సానుకూలం కావడానికి ఒక ప్రధాన కారణం అవుతుంది అంటున్నారు. ఇక మంత్రి పేర్ని నాని సైడ్ నుంచి చూసుకుంటే మీ వాదనలు ఏమైనా చెప్పుకోవచ్చు ప్రభుత్వం వింటుంది, సానుకూలం చేయడానికి చూస్తుంది అని ఈ మధ్యనే ఓపెన్ గా చెప్పారు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. మిగిలిన వారు ఎవరైనా పెద్దగా టాలీవుడ్ నుంచి చర్చలకు వెళ్లినా వారి మీద ఏదో ఒక ముద్ర వేసేసే వీలు ఉంది. వర్మ ఇలాంటి బ్రాండ్స్ కి అన్నింటికీ అతీతుడు.
ఆయన ఫెయిర్ గా ఉంటారు. చెప్పాల్సింది ముక్కుసూటిగా చెబుతారు. ప్రభుత్వం కూడా వర్మ చెప్పిన వాటిని విని ఓకే చేసినా ఆర్జీవీకి ఆ క్రెడిట్ వెళ్లినా కూడా పెద్దగా అబ్జక్షన్స్ ఎవరికీ ఉండవు. సో ఏ విధంగా చూసుకున్నా నానీ వర్సెస్ ఆర్జీవీ మీటింగ్ మీద అయితే అంతా ఆశగా చూస్తున్నారు. ఇక ప్రతీ దాన్ని టేకిట్ ఈజీ మోడ్ లో ఆలోచించే వర్మ ఫస్ట్ టైమ్ అతి పెద్ద బాధ్యతను మోస్తూ ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళడం కంటే ఇంటరెస్టింగ్ మ్యాటర్ అయితే వేరేది లేదు. మొత్తానికి ఈ భేటీ తరువాత అయినా టాలీవుడ్ పడుతున్న ఇబ్బందులు అన్నీ ప్రభుత్వానికి తెలిసి మంచి పరిష్కారం ఉంటుందని అంతా ఎదురుచూస్తున్నారు.