Begin typing your search above and press return to search.

ఆర్జీవీ.. లైన్ పూర్తిగా క్రాస్ చేసేశాడుగా?

By:  Tupaki Desk   |   26 March 2019 4:44 AM GMT
ఆర్జీవీ.. లైన్ పూర్తిగా క్రాస్ చేసేశాడుగా?
X
ప‌డ‌కపోవ‌చ్చు. ప‌ద్ద‌త‌లు అస్స‌లు న‌చ్చ‌క పోవ‌చ్చు. అంత మాత్రాన ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా.. వెనుకా ముందు చూసుకోకుండా.. నా నోరు నాఇష్టం అన్న త‌ర‌హాలో తిట్టేయ‌టం స‌రైన ప‌ద్ద‌తేనా? ముఖ్య‌మంత్రి కుర్చీలో ఉన్న వ్య‌క్తిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య‌లు చేసేయొచ్చా? తిట్టే విష‌యంలోనూ ఒక ప‌ద్ద‌తి.. పాడు లేకుండా.. నోటికి వ‌చ్చింది వ‌చ్చిన‌ట్లుగా సోష‌ల్ మీడియాలో రాసేయ‌టం స‌రైన ప‌ద్ద‌తేనా? అన్న సందేహం వ‌చ్చేలా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వర్మ తాజాగా వ్య‌వ‌హ‌రించారు.

తాజాగా ఆయ‌న తీసిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నేప‌థ్యంలో బాబుపై ఆయ‌న చేస్తున్న విమ‌ర్వ‌ల గురించి తెలిసిందే. తాజాగా లైన్ పూర్తిగా క్రాస్ చేసేలా చేసిన ట్వీట్ ఒక‌టి ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. తిరుప‌తిలో నిర‌స‌న ర్యాలీ నిర్వ‌హించ‌టం.. త‌న క‌ళాశాల‌కు ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వ బకాయిల మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న మోహ‌న్ బాబు విష‌యం తెలిసిందే.

తాజాగా ఆయ‌న రాంగోపాల్ వ‌ర్మ‌తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఒక ఫోటోను పోస్ట్ చేసిన వ‌ర్మ‌.. దానికి పెట్టిన క్యాప్ష‌న్ అభ్యంత‌ర‌క‌రంగా ఉంద‌ని చెప్పాలి. తానెప్పుడో చంద్ర‌బాబు గురించి అనుకోలేదంటూ దారుణ‌మైన తిట్టును అక్ష‌రాల్ని మ‌ధ్య‌లో మిస్ చేసి తిట్టేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. కొన్ని అంశాల‌కు సంబంధించి ఇద్ద‌రు ప్ర‌ముఖుల‌కు ప‌డ‌క‌పోవ‌చ్చు. అంత మాత్రాన నోటికి వ‌చ్చిన‌ట్లుగా తిట్టేయ‌టంలో అర్థం లేదు.

దారుణ‌మైన తిట్టును తిట్టేయ‌టం ఏ మాత్రం స‌మ‌ర్థ‌నీయం కాద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి కొన‌సాగింపుగా.. ఇప్ప‌టికైనా మోహ‌న్ బాబు చంద్ర‌బాబుకు సంబంధించిన నిజాల్ని చెప్ప‌టం భేష్ అని రాసుకొచ్చారు. వ్య‌వ‌స్థ‌లో ల‌క్ష్మ‌ణ రేఖ‌ల్ని దాటే వారు ఎంత‌టి ప్ర‌ముఖులైనా స‌రే.. దానికి త‌గ్గ మూల్యం చెల్లించాల్సిందే. లేని ప‌క్షంలో ఆరాచ‌కం నెల‌కొన‌టం ఖాయం. శ్రీ‌రెడ్డి ఎపిసోడ్ లోనూ తాను ప‌వ‌న్ ను తిట్ట‌మ‌ని ఆమెకు స‌ల‌హా ఇచ్చాన‌ని ఆర్జీవీ ఆ ఎపిసోడ్ లో బ‌య‌ట‌పెట్ట‌టం తెలిసిందే. వ‌ర్మ‌ త‌ర‌హా ఇష్టారాజ్యానికి ఎక్క‌డో అక్క‌డ ఫుల్ స్టాప్ ప‌డాల్సిందేనన్న అభిప్రాయాన్ని కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు.