Begin typing your search above and press return to search.

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ కోసం వ‌ర్మ ఎవ‌రితో మాట్లాడారు?

By:  Tupaki Desk   |   16 Oct 2017 7:19 AM GMT
ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ కోసం వ‌ర్మ ఎవ‌రితో మాట్లాడారు?
X
అటు టాలీవుడ్ లోనూ.. ఇటు తెలుగు రాజ‌కీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వ‌ర్మ తీస్తున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ. ఎన్టీఆర్ జీవితచ‌రిత్ర అన్నంత‌నే ఆస‌క్తి వ్య‌క్త‌మైతే.. ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యుల‌కు ఏ పేరు అయితే న‌చ్చ‌దో.. ఇప్పుడు అదే పేరును ప్ర‌ముఖంగా ఫోక‌స్ చేస్తూ.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో తీస్తున్న మూవీ మీద జ‌రుగుతున్న చ‌ర్చ అంతా ఇంతా కాదు.

ఇదిలా ఉంటే.. ఈ మూవీకి వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేత ప్రొడ్యూస‌ర్ కావ‌టం మ‌రింత వేడి పుట్టించింది. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి బ‌ద్ధ వ్య‌తిరేకి అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తీస్తున్న ఎన్టీఆర్ మూవీ ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

దీనిపై గ‌డిచిన కొద్దిరోజులుగా అధికార‌.. ప్ర‌తిప‌క్ష నేత‌ల మ‌ధ్య మాట‌లు వాడీవేడిగా సాగుతున్నాయి. ఎన్టీఆర్ ను కించ‌ప‌రిచేలా సినిమా ఉంటే వ‌ర్మ ఇంటి ముందు ధ‌ర్నా చేస్తామ‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ గా న‌టిస్తున్న‌ది ఎవ‌రు? ల‌క్ష్మీ పార్వ‌తి క్యారెక్ట‌ర్ చేస్తున్న వాళ్లు ఎవ‌రు? ఈ సినిమాకు సంబంధించిన క‌థ కోసం వ‌ర్మ ఎవ‌రెవ‌రిని క‌లిశారు? మూవీ టైటిల్ లో ఉన్న ల‌క్ష్మీ పార్వ‌తిని క‌లిశారా? అయినా.. ఎన్టీఆర్ జీవితాన్ని ల‌క్ష్మీ పార్వ‌తి ఎంట్రీతోనే ఎందుకు మొద‌లు పెట్టారు? లాంటి ప్ర‌శ్న‌ల‌కు వ‌ర్మ తాజాగా బ‌దులిచ్చారు. ఒక ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో సినిమాకు సంబంధించి ఏమేం చెప్పార‌న్న‌ది చూస్తే..

+ ఎన్టీఆర్ మూవీని అనౌన్స్ చేసిన‌ప్పుడు ఏం తీయాలి? ఎలా తీయాలి? అన్న దాని మీద క్లారిటీ లేదు. కొన్ని వీడియోల్లో ల‌క్ష్మీ పార్వ‌తికి సంబంధించిన‌వి చూశా. అప్పుడు నాకు అనిపించిందేమంటే.. ఎప్పుడో స్టార్ అయిపోయి.. సూప‌ర్ పొలిటీసియ‌న్ గా ఉన్న అన్నేళ్ల ఎన్టీఆర్ గారి బ‌యోపిక్ ను రెండు గంట‌ల్లో తీసి న్యాయం చేయ‌టం స‌రికాద‌నిపించింది.

+ నిజానికి అలా చేయ‌టం సాధ్యం కాని ప‌ని. అస‌లు ఎన్టీఆర్ యాక్ట‌ర్ ఎలా అయ్యారు? రాజ‌కీయ ఆలోచ‌న ఎప్పుడు ఎందుకు వ‌చ్చింది? సీఎం ఎలా అయ్యారు? లాంటి సెగ్మెంట్లు ఉన్నాయి. ఇలా చూసిన‌ప్పుడు నాకు మ‌హాభార‌తంలో భాగాల మాదిరి ఎన్టీఆర్ జీవితం అనిపించింది. వీట‌న్నింటిలోనూ ల‌క్ష్మీపార్వ‌తి ఎంట‌ర్ అయిన త‌ర్వాత నుంచి చ‌నిపోయే వ‌ర‌కు ఉన్నది చాలా ఇంట్ర‌స్టింగ్ గా అనిపించింది.

+ బ‌యోపిక్ అంటే.. అంద‌రికి తెలిసిన స్టోరీనే ఉంటుంది. గాంధీ సినిమా ఆయ‌న్ను ట్రైన్ లో నుంచి బ‌య‌ట‌కు తీసేసిన‌ప్పుడే స్టార్ట్ అవుతుంది. అంత‌కు ముందు ఆయ‌న ఎక్క‌డ పుట్టాడు.. ఏం చేశాడ‌న్న‌ది అక్క‌డ మ‌న‌కు అక్క‌ర్లేదు. నా వ‌ర‌కు నాకు.. సినిమాల ప‌రంగా ఎన్టీఆర్ స్ట్ర‌గుల్ అయ్యింది లేదు. అలాంట‌ప్పుడు అర్టిఫిషియ‌ల్ గా ఒక స్ట్ర‌గుల్ అయ్యారని తీస్తే ఇష్ట‌ప‌డ‌రు.

+ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ వ‌చ్చేస‌రికి అంత గ్రేటెస్ట్ లైఫ్ ను గ‌డిపి.. చివ‌ర్లో సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి మ‌నిషిలా స్ట్ర‌గుల‌వ్వ‌టం ఓ టెరిఫిక్ డ్రామా అనిపించింది. అందుకే దాని మీద ఫోక‌స్ చేశా. సినిమాకు సంబంధించి చాలామందిని క‌లిశా. సొంత అజెండా ఉన్న వాళ్ల‌ని ఎక్కువ‌గా క‌ల‌వ‌ను. అందుకే ల‌క్ష్మీ పార్వ‌తిని క‌ల‌వ‌లేదు. ల‌క్ష్మీ పార్వ‌తి ఎంట‌ర్ అయ్యాక ఎన్టీఆర్ జీవితానికి ఒక ఫండ‌మెంట‌ల్ డిఫ‌రెన్స్ ఉంది. అది న్యూట్ర‌ల్ యాస్పెక్ట్‌. సినిమా కోసం వాళ్లింట్లో ప‌ని చేసిన డ్రైవ‌ర్లు.. ప‌నోళ్లంద‌రితో మాట్లాడా.

+ సినిమా ఆరేళ్ల వ‌య‌సుతో ప్రారంభ‌మ‌వుతుంది. అంద‌రికి తెలిసిన న‌టుడు ఈ సినిమాను తీయ‌టం క‌ష్టం. అసాధ్యం. అందుకే.. ఎన్టీఆర్ లా అనిపించే పోలిక‌లు ఉన్న వ్య‌క్తికి ట్రైనింగ్ ఇచ్చి చేయిస్తున్నా.. కొత్త వ్య‌క్తి. ల‌క్ష్మీ పార్వ‌తి క్యారెక్ట‌ర్ కూడా కొత్త వ్య‌క్తే.

+ సినిమా ఎన్నిక‌ల నాటికి రిలీజ్ కావ‌టం కో ఇన్సిడెంట్ మాత్ర‌మే. వ‌చ్చే ఆగ‌స్టు.. సెప్టెంబ‌ర్ నాటికి సినిమా పూర్తి కానుంది. ప్రొడక్ష‌న్ ఇప్ప‌టికే స్టార్ట్ అయిపోయింది.