Begin typing your search above and press return to search.
బుజ్జగింపులు మొదలెట్టిన వర్మ
By: Tupaki Desk | 3 Dec 2016 7:00 AM GMTరామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఉదయమే హైదరాబాద్ నుంచి విజయవాడ బయల్దేరి వెళ్లాడు. మరికొన్ని గంటల్లోనే ఆయన తెరకెక్కించిన వంగవీటి సినిమాలోని పాటలు విజయవాడలో విడుదల కాబోతున్నాయి. ఆ వేడుకకి ముంబై నుంచి తన స్నేహితులంతా హాజరవుతున్నారు. ఒక గ్రాండ్ మేనర్ లో ప్లాన్ చేసిన ఈ వేడుకలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు? వేడుక ఎలా జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. విజయవాడలోని రెండు ప్రధాన వర్గాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడంతో `వంగవీటి` మొదట్నుంచీ సంచలనాత్మక చిత్రంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పలు వివాదాలు - పలు ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఇటీవల వంగవీటి రంగా వర్గం మమ్మల్ని తక్కువ చేసి చూపేలా సినిమా తెరకెక్కిందనే సందేహాలు వ్యక్తం చేస్తూ కోర్టుకెళ్లింది.
అయితే కోర్టు మాత్రం పలు రకాల సూచనలు చేసి ఆ కేసుని కొట్టివేసింది. అయినప్పటికీ రామ్ గోపాల్ వర్మ ఆ వర్గాన్ని బుజ్జగించే ప్రయత్నానికి పూనుకున్నారు. స్వచ్ఛందంగా కమ్మ కాపు... అంటూ సాగే పాటని సినిమా నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ఈరోజు ఉదయమే విజయవాడ వెళ్లిన వర్మ నేరుగా వంగవీటి రత్నకుమారినీ, వంగవీటి రాధాని కలిశారు. వాళ్లతో చాలాసేపు మంతనాలు జరిపారు. సినిమాలో తానేం చూపించానో ఈ సందర్భంగా వంగవీటి కుటుంబానికి వర్మ తెలియజెప్పినట్టు తెలిసింది. ఇదివరకు దేవినేని వర్గాన్ని కూడా వర్మ కలిశాడు. వాళ్లతోనూ సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. స్వతహాగా విజయవాడకి చెందిన వర్మకి స్థానిక రాజకీయ వర్గాలు, వైషమ్యాలపై మంచి అవగాహన ఉంది. ఇరు వర్గాలు తమ ప్రతాపాన్ని చూపించిన సమయంలో వర్మ విజయవాడలోనే ఉన్నారు. ఆ పరిస్థితులన్నింటినీ తనదైన కోణంలో చూపిస్తూ ఈ సినిమాని తెరకెక్కించారు వర్మ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/