Begin typing your search above and press return to search.
అంత ధైర్యం ఉందా వర్మా?
By: Tupaki Desk | 20 Feb 2019 4:34 AM GMTప్రస్తుతం తన లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించిన భీభత్సమైన పబ్లిసిటీ చేసుకోవడంలో బిజీగా ఉన్న వర్మ దాని విడుదల అడ్డుకుంటే పరిణామాలు వేరుగా ఉంటాయని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిలా ఉంచితే ఎప్పుడూ వర్తమాన విషయాలపై ఓ కన్నేసి ఉంచుతూ వాటి మీదే సినిమాలు చేసుకునే వర్మ గతంలో ముంబై తాజ్ హోటల్ మీద జరిగిన బాంబు దాడి కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ది ఎటాక్స్ అఫ్ 26 /11 బాగానే పేరు తీసుకొచ్చింది. అయితే దాని తర్వాత అలాంటి ప్రయత్నాలు ఏమి చేయలేదు. తాజాగా దేశాన్ని కుదిపేస్తున్న పుల్వామా మీద తీవ్రవాదుల దాడి మీద వర్మ తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన అభిమానుల్లో మొదలైంది.
నిజానికి వర్మ మాఫియా-దెయ్యాల మీద పెట్టిన ఫోకస్ పాకిస్థాన్ టెర్రరిజం మీద ఎప్పుడూ పెట్టలేదు. ఆ సబ్జెక్టు ని టచ్ చేస్తే ఎన్నో అద్భుతమైన కథలను సృష్టించవచ్చు. కానీ ఆ అవకాశాన్ని వాడుకునే దిశగా ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు పుల్వామా మీద ఏదైనా స్క్రిప్ట్ ట్రై చేస్తే మంచి బజ్ ని సృష్టించుకోవచ్చు. ఎలగూ అంతో ఇంతో బాలీవుడ్ లో పేరుంది కాబట్టి మార్కెటింగ్ కి ఇబ్బందులు ఉండవు
కానీ అసలు చిక్కు ప్రశ్న వర్మకు అంత ధైర్యం ఉందా అని. పాక్ మీద వ్యతిరేకంగా వర్మ ఇప్పటిదాకా ఎందుకు సినిమాలు చేయలేదు అన్న కామెంట్ ప్రేక్షకుల్లో ఉంది. వీరప్పన్ లాంటి అడవి దొంగ బయోపిక్ గా తీయలేనిది దేశాన్ని పట్టి పీడిస్తున్న టెర్రరిస్టుల ఆగడాలను - వారి దురాగతాలకు బలవుతున్న సైనికుల వీర గాధలను ఎందుకు చూపకూడదు అనేదే వాళ్ళ వెర్షన్. అయినా వర్మ ఇవన్నీ పట్టించుకునే టైపు కాదు. తనకు ఏదైతే అప్పటికప్పుడు వర్క్ అవుట్ అవుతుందో ఏదైతే కమర్షియల్ గా నాలుగు డబ్బులు ఇస్తుందో దాని మీద వర్మ గురి ఉంటుంది కానీ ఇలాంటివి పట్టించుకునే రకమా