Begin typing your search above and press return to search.

వర్మ.. ఇక మీ మార్క్ ట్వీటే మిగిలింది బాస్

By:  Tupaki Desk   |   30 Sept 2016 10:39 AM IST
వర్మ.. ఇక మీ మార్క్ ట్వీటే మిగిలింది బాస్
X
దేశంలో ఏ సంచలనం జరిగినా.. అందరి కంటే ముందుగా రియాక్ట్ కావటం ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు అలవాటే. అంతేకాదు.. తాజాగా భారత సైనికులు జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ లాంటి ఘటనలు చోటు చేసుకున్న వెంటనే.. వేగంగా స్పందించిన ఆయ‌న ట్విట్టర్ లో తనదైన కోణంలో ట్వీట్స్ పెట్టటం మామూలే. ట్వీట్స్ తో పాటు తన తాజా చిత్రం సదరు అంశం మీద ఉంటుందని ప్రకటిస్తుంటారు.

భారత సైన్యం సాహసోపేతంగా వ్యవహరించి జరిపిన లక్షిత దాడుల ఎపిసోడ్ ను వర్మ సినిమాగా రూపొందిస్తారా? అన్న అంశంపై చిత్ర పరిశ్రమలో చర్చ సాగుతోంది. ఇలాంటి ఇంట్రస్టింగ్ టాపిక్స్ మీద తనదైన శైలిలో సినిమాగా మలచగల సత్తా వర్మ సొంతం. పాక్ లో రహస్యంగా తలదాచుకున్నట్లుగా చెప్పే లాడెన్ ను ఏసేసిన వైనంపై ఇప్పటికే హాలీవుడ్ సినిమాలు రావటం తెలిసిందే.

ప్రపంచం మొత్తానికి భారత్ లోని మరో కోణాన్ని చూపించిన తాజా లక్షిత దాడులపై వర్మ సినిమా అనౌన్స్ చేస్తారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అశేష భారతాన్ని ఆనందంలో ముంచెత్తిన సర్జికల్ స్ట్రైక్స్ పై వర్మ సినిమా ఉంటుందా? ఉంటే.. ఇంకా ఆయన ప్రకటించకపోవటం ఏమిటని ఆయన్ను అభిమానించే వారంతా వెయిట్ చేస్తున్న పరిస్థితి. లక్షిత దాడులపై వర్మ మార్క్ సినిమాకు సంబంధించిన ట్వీట్ మాత్రమే మిగిలి ఉందంటూ సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న పోస్టింగ్ లకు వర్మ తన ట్వీట్ తో ఎప్పుడు సమాధానం చెబుతారో..?