Begin typing your search above and press return to search.
ఒక్కటన్నా సరిగ్గా తియ్యవయ్యా బాబూ..
By: Tupaki Desk | 10 April 2015 11:30 PM GMTతమిళనాడు, కర్ణాటక రాష్ట్ర పోలీసులకు అడవి దొంగ వీరప్పన్ చుక్కలు చూపించాడు. ఏకంగా 15 ఏళ్ళపాటు కూంబింగ్ చేసినా వీరప్పన్ ఒక్కసారి కూడా దొరకలేదు. కాని ఎట్టకేలకు ఒక వీరోచిత పోలీస్ వీరప్పన్‌ను పట్టుకొని కాల్చి చంపేశాడు. ఇకపోతే వీరప్పన్ కంటే కూడా, సదరు వీరప్పన్‌ను కాల్చి చంపిన పోలీస్ కథనం చాలా ఆసక్తికరగా ఉందట. అందుకే ఇప్పుడు అతని కథతో ''వీరప్పన్ కిల్లింగ్'' అనే సినిమాను తీస్తున్నాడు రామ్‌గోపాల్ వర్మ.
గతంలో వీరప్పన్ చేతిలో కిడ్నాప్ అయిన కన్నడ నటుడు రాజ్‌కుమార్ కొడుకు పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడట. బాగానే ఉంది. కాని ఎన్ని సినిమాలు ప్రకటిస్తావ్ రాము? మొన్ననే ''సైలెంట్'' అనే సైలెంట్ సినిమా తీస్తున్నా అన్నావ్.. ఇప్పటికే ఎక్స్.ఇ.ఎస్, శ్రీదేవి మొదలైన సినిమాలు ప్రకటించావ్. ఆల్రెడీ ఎటాక్ తీస్తున్నావ్. 365 డేస్ పూర్తయ్యింది. పట్టపగలు సినిమా రిలీజ్ అవ్వకుండా ఆగిపోయింది. వీటిల్లో ఒక్కటైనా సరిగ్గా ఆడుతుందా లేదా అనే పరిస్థితి నెలకొన్న క్రమంలో, ఇలా కొత్త కొత్త ప్రాజెక్టులు ఎనౌన్స్ చేసుకుంటూ పోతే ఎలా?