Begin typing your search above and press return to search.
వర్మ ట్రైలర్ చూపించి మెగాస్టార్ ను పడేశాడా?
By: Tupaki Desk | 29 Dec 2015 9:30 AM GMTఒకప్పుడు బాలీవుడ్ ను రారాజులా ఏలాడు రామ్ గోపాల్ వర్మ. ‘ఆర్జీవీ ఫ్యాక్టరీ’ అని పెట్టి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలకు కూడా గుబులు పుట్టేలా పదుల సంఖ్యలో సినిమాలు వదిలాడు. తన దర్శకత్వంలో క్లాసిక్స్ తీస్తూనే.. యువ ప్రతిభావంతులకు తన బేనర్లో అవకాశం కల్పించాడు. బాలీవుడ్ లో ఆయనకు తిరుగుండేది కాదు అప్పట్లో. అలాంటి స్థితి నుంచి సొంతంగా సినిమాలు తీయలేక, వేరేవాళ్ల నుంచి అవకాశాలు దక్కక టాలీవుడ్ కు వచ్చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నాడు. నాలుగేళ్లుగా వర్మ మకాం హైదరాబాదుకే పరిమితమైంది. ఆర్జీవీ తీరు చూస్తే మళ్లీ అతను బాలీవుడ్ కు వెళ్లడం అసాధ్యమే అనిపించింది. కానీ వర్మ మళ్లీ ముంబయికి వెళ్తున్నాడు. అక్కడో భారీ సినిమా తీయబోతున్నాడు.
ఇంతకుముందు అమితాబ్ బచ్చన్ తో సర్కార్ - సర్కార్ రాజ్ సినిమాలు తీసి మెప్పించిన వర్మ.. ఇప్పుడీ సిరీస్ లో మూడో పార్ట్ తీయబోతున్నాడు. ఐతే వర్మ డైరెక్టోరియల్ స్టాండర్డ్స్ బాగా పడిపోయిన ఈ టైంలో కూడా మెగాస్టార్ అమితాబ్ తనతో సినిమా చేయడానికి ఒప్పుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. వర్మను నమ్మి ఆగ్ - నిశ్శబ్ద్ - రణ్ లాంటి సినిమాలు చేసి దెబ్బ తిన్నాడు అమితాబ్. అయినా అతడితో ఇంకో సినిమా ఒప్పుకోవడం చిత్రమే. బహుశా ‘కిల్లింగ్ వీరప్పన్’ ట్రైలర్ ఆయనకు మళ్లీ వర్మపై నమ్మకం కలిగించి ఉండొచ్చేమో. వర్మ గత సినిమాల గురించి ఏమీ మాట్లాడని అమితాబ్.. ఈ మధ్య ‘కిల్లింగ్ వీరప్పన్’ ట్రైలర్ గురించి మాత్రం స్వచ్ఛందంగా స్పందించాడు. ట్రైలర్ సూపర్బ్ అన్నాడు. ఈ నేపథ్యంలో సర్కార్-3 స్క్రిప్టు కూడా ఓకే అయినట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది జులైలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని వర్మ ప్రకటించాడు.