Begin typing your search above and press return to search.
మనోళ్లు మళ్లీ నమ్ముతారంటారా?
By: Tupaki Desk | 18 Jun 2018 4:57 AM GMTసినిమాను వీలైనంతగా చుట్టేయడం.. ఏదో ఒక వివాదం రగిలించి వార్తల్లో నిలవడం.. టీవీ ఛానల్స్ లో తెగ ఇంటర్వ్యూలు ఇచ్చి మరిన్ని ఆరోపణలు చేసి.. ఎలాగోలా మూవీ బడ్జెట్ మేరకు ఓపెనింగ్స్ రాబట్టేయడం.. బయ్యర్స్ మునిగిపోయినా.. తను సేఫ్ అయిపోవడం వంటివి రాంగోపాల్ వర్మ ఖాతాలో చాలానే కనిపించాయి. కానీ ఇలాంటి వాటన్నిటికీ ఆఫీసర్ తో బ్రేక్ పడిపోయింది.
సినిమాలో కంటెంట్ నచ్చకపోవడం కంటే.. నాగార్జునతో మూవీ చేస్తున్న సమయంలో రగిలించిన వివాదాలు తెలుగు ఆడియన్స్ లో విపరీతమైన వ్యతిరేకతకు కారణం అయ్యాయి. అందుకే.. నాగ్ కలలో కూడా తలచుకునేందుకు ఇష్టపడని స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. కేవలం మూవీ కంటెంట్ బాగోకపోవడం కారణం అయుంటే.. కనీసం ఓపెనింగ్స్ అయినా వచ్చి ఉండాలి. ఆఫీసర్ ను వదిలేసి పనిలో పడిపోతున్నా అని నాగ్ అప్పుడే చెప్పేశారు. ఇప్పుడు వర్మ కూడా తన మరుసటి సినిమాపై దృష్టి పెట్టాడు.
భైరవ గీత అంటూ తెలుగు- కన్నడ భాషలలో ఓ సినిమాను రూపొందిస్తున్నాడట. ఇది బాగా వయొలెంట్ లవ్ స్టోరీ అని.. గ్రామీణ నేపథ్యంలో ఉంటుందని చెబుతున్నారు. అణగారిన వర్గాలపై భూస్వామ్య వ్యవస్థను ఎదిరించే ఓ వ్యక్తి ప్రేమకథను.. చాలా రియలిస్టిక్ గా చూపబోతున్నారట. కన్నడ నటుడు దాలి ధనుంజయ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని సిద్ధార్ద్ దర్శకత్వంలో రూపొందిస్తుండగా.. ఆర్జీవీ టీం నిర్మించనుంది.
ఇంతకీ ఇప్పుడు రాంగోపాల్ వర్మ అనే బ్రాండ్ ను తెలుగులో ఎవరైనా నమ్మేందుకు సాహసిస్తారా అన్నదే డౌట్. మూవీ టీంను చూస్తే.. కన్నడ సినిమానే తెలుగులో కూడా చుట్టేసి బైలింగ్యువల్ అనే బిల్డప్ ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యి.. తనను తెలుగు ఆడియన్స్ నమ్మేలా చేసే అవకాశం వర్మకు ఉందా అన్నదే ఆలోచించాల్సిన విషయం.