Begin typing your search above and press return to search.
మరో రాజకీయ పంచ్ పేల్చిన వర్మ
By: Tupaki Desk | 16 Dec 2016 4:23 AM GMTరామ్ గోపాల్ వర్మకి ఎటకారమో లేక కుర్రతనమో తెలియదుగానీ ఒక జాతీయ స్థాయి ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని మించిన ఎటెన్షన్ లాక్కోవడానికి నానా విధాలా కష్టపడతాడు. అందుకు ఆయన రిజిస్టర్ చేయించే టైటిల్స్ సరైన ఉదాహరణ.
అప్పట్లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డిగారు హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించాక ఆంధ్ర రాజకీయ పరిస్థితి ఏమిటి అని అందరూ ఆందోళన పడుతుంటే వర్మమాత్రం 'రెడ్డిగారు పోయారు' అంటూ సినిమాను అనౌన్స్ చేసి షాకిచ్చాడు. ఇటీవల తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నేపథ్యంలో చంద్రబాబు, కె.సి.ఆర్ ల ఎదురుదాడులను స్మరిస్తూ 'ఆంధ్రా సి.ఎం కిడ్నాప్డ్ - తెలంగాణా సి.ఎం సస్పిక్టెడ్' అంటూ మరో వెర్రి టైటిల్ ని ప్రకటించాడు.
ఇప్పుడు తమిళనాట అమ్మగా కీర్తించబడే జయలలిత మరణానంతరం సాగుతున్న ప్రచారాలలో ఆమె సన్నిహితురాలు శశికళ గురించిన వార్తల ప్రాముఖ్యత అందరికీ తెలిసినదే. వర్మ శశికళ పేరుతొ ఒక టైటిల్ రిజిస్టర్ చేయించాడు. ఒక పొలిటికల్ లీడర్ ఫ్రెండ్ నేపథ్యంలో సాగే కధ అని, పూర్తిగా ఫిక్షన్ అని చెప్పడం విశేషం. పై చెప్పుకున్న రెండు సినిమాలూ ఇప్పటికి మొదలు కూడా కాలేదు. మరి ఈ తాజా సినిమా పరిస్థితి ఏమవుతుందో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/