Begin typing your search above and press return to search.
ఏంటి 'ఆఫీసర్' నువ్వు కూడానా?
By: Tupaki Desk | 2 March 2018 8:14 AM GMTటాలీవుడ్ లో ఈ మధ్య కాపీల ప్రహసనం గురించి పెద్ద చర్చే జరుగుతోంది. హాలీవుడ్, కొరియన్, ఫ్రెంచ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది వాటిని తెలుగీకరించి హీరోల ఇమేజ్ కు తగ్గట్టు తిరిగి తీయటం అనే ట్రెండ్ కొత్తగా పుట్టింది కాదు. చిరంజీవి కెరీర్ ని అమాంతం మలుపు తిప్పిన ఖైదికి స్ఫూర్తి రాంబో సిరీస్ లో వచ్చిన ఫస్ట్ బ్లడ్ అని పరుచూరి సోదరులు స్వయంగా ఒప్పుకున్నారు.అలా అని అదేమి రిమేక్ కాదు కాబట్టి హక్కులు కొనే అవసరం రాలేదు. అప్పటి ప్రేక్షకులకు ఇంగ్లీష్ సినిమాలు విరివిగా చూసేంత సౌలభ్యం కూడా ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితులు వేరు. మొదటి ఆట చూస్తుండగానే అది ఎక్కడి నుంచి లిఫ్ట్ చేసారో పసిగట్టి వెంటనే దాని బండారం ఆన్ లైన్ లో పెడుతున్నారు. మొన్న అజ్ఞాతవాసి అంత రచ్చ కావడంలో సోషల్ మీడియా పోషించిన పాత్ర చిన్నదేమీ కాదు.
ప్రస్తుతం తెలుగులో నిర్మాణంలో ఉన్న రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా ఇలాంటి స్ఫూర్తి బ్యాచే అననే టాక్ ఇప్పటికే ఉంది. ఇక వర్మ ఆఫీసర్ ను కూడా ఇవి చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే వర్మ టీంలో గతంలో పనిచేసిన జయకుమార్ ఈ కథ నాదే అంటున్నాడు. జిఎస్టి విషయంలో కూడా జయకుమార్ పెద్ద రాద్ధాంతమే చేసాడు. వర్మ వాటిని కొట్టి పారేసాడు కాని జయకుమార్ మాత్రం తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అంటున్నాడు. ఆఫీసర్ కథ తాను గతంలో చెప్పిందే అంటున్న జయ కుమార్ వర్మను తేలిగ్గా వదలను అని ఛాలెంజ్ కూడా చేసాడు.
ఇది చాలదు అన్నట్టు ఆఫీసర్ మూవీ లైన్ ను హాలీవుడ్ నుంచి ‘టేకెన్’ నుంచి తీసుకున్నట్టు మరో వార్త ఇప్పుడు గుప్పుమంది. తన కూతురిని కిడ్నాప్ చేసిన ఒక విలన్ గ్యాంగ్ ని మట్టుబెట్టే రిటైర్ పోలీస్ ఆఫీసర్ కథే ఆ సినిమా. ఆ మధ్య లీక్ అయిన ఆఫీసర్ స్టిల్ లో నాగ్ ఒక పాప పక్కన గన్ తో నిలుచోవడం చూస్తే అనుమానం రాకమానదు. వర్మ వీటికి ఏమని బదులు ఇస్తాడో వేచి చూడాలి.