Begin typing your search above and press return to search.
పోర్న్ చూస్తే పిల్లలు చెడిపోరు....వర్మ!
By: Tupaki Desk | 22 Jan 2018 3:38 AM GMTఓ ప్రముఖ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీఎస్టీ ‘గాడ్ - సెక్స్ అండ్ ట్రూత్’ పై వర్మ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. నాకు సెక్స్ అంటే ఇష్టం...నా ఇష్టమొచ్చినట్లు అనుభవిస్తాను....నేను కేవలం ఒక్కరికే సొంతం అవను....అని భావించే ఒక స్త్రీ గా మియా మాల్కోవా `జీఎస్టీ`లో నటించిందన్నారు. తరతరాలుగా పురుషులు కూడా ఈ తరహాలోనే తనకు నచ్చిన వారితో సెక్స్ చేస్తా అనే ఫీలింగ్ తో ఉన్నాడని వర్మ చెప్పారు. అది విష సంస్కృతి కాదని...అమృత సంస్కృతి అని చెప్పారు. ఒక అమ్మాయి ఆ విధంగా ఆలోచిస్తోందని...అలా చేయవద్దని చెప్పే హక్కు ఎవరికీ లేదని...తాను అందరు అమ్మాయిలూ అలా చేయమని చెప్పడం లేదని అన్నారు. ఆ చానెల్ ప్రతినిధి అడిగిన ఓ ప్రశ్నకు వర్మ దిమ్మదిరిగిపోయే సమాధానమిచ్చాడు. జీఎస్టీ ప్రభావం పిల్లలపై పడుతుందన్న ప్రశ్నకు.....పిల్లలు పోర్న్ చూస్తే తప్పేంటీ...అని వర్మ ఎదురు ప్రశ్నించి షాక్ ఇచ్చాడు.
కామసూత్ర ఎల్ కేజీ తో సమానమని...తనతో పాటు చాలామంది ఆ విషయంలో పీహెచ్ డీ చేశారన్నారు. చాలామంది ఉన్నారు. ప్రేమకు సెక్స్ కు సంబంధం లేదని, సెక్స్ అనేది ఒక కోరికని, అది ఒక శారీరక భావోద్వేగమని చెప్పారు. ఆ భావోద్వేగాన్ని నియంత్రించుకొని, కేవలం భార్యా భర్తలు ఒకరితో ఒకరు సెక్స్ లో పాల్గొనాలని సమాజం, కొన్ని వర్గాలు....కట్టుబాట్లు విధించుకున్నాయన్నారు. సమాజాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఆ కట్టుబాట్లుంటాయన్నారు. పిల్లలు పోర్న్ చూస్తే తప్పేంటని వర్మ ప్రశ్నించారు. వారికి కౌమార దశ వచ్చే వరకు పోర్న్ చూసినా...చూడకపోయినా వారు చెడిపోరని...కౌమార దశకు వచ్చాక కొద్దిగా డిస్టర్బ్ అవుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు. తన అనుభవంలో సెక్స్ గురించి తెలిసిన విషయాలన్నింటినీ మియా చేత చెప్పించానన్నారు. సెక్స్ చేయడం వల్ల మనిషికి తృప్తి లభించి హాయి కలుగుతుందని, ప్రేమ వల్ల ఒకరిపై ఒకరికి అంచనాలు పెరిగి...అవి అందుకోలేక మనస్పర్థలు వచ్చే అవకాశముందని ఒక కొటేషన్ కు వర్మత తనదైన శైలిలో అర్థం చెప్పారు. సెక్స్ అనేది ప్రకృతి ద్వారా మానవుడికి సహజ సిద్ధంగా లభించిన వరమని...దానిని మొదటిసారి బోల్డ్ గా ప్రపంచానికి చాటి చెప్పిన తొలి మహిళ మార్లిన్ మన్రో అని వర్మ చెప్పారు.