Begin typing your search above and press return to search.
వర్మ జూనియర్ ని కూడా వాడేశాడా!
By: Tupaki Desk | 9 March 2019 9:30 AM GMTలక్ష్మీస్ ఎన్టీఆర్ మీద అంచనాలు మెల్లగా ఎగబాకుతున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న నేపధ్యంలో వర్మ సినిమాల ఎప్పుడో ఆశలు వదిలేసుకున్న ప్రేక్షకులు సైతం దీన్ని మాత్రం చూస్తామని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంలోని కీలక పాత్రధారులందరిని పేర్లు గెటప్పులతో సహా వాడేసిన వర్మ ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ని సైతం ప్రస్తావించినట్టు ఇన్ సైడ్ టాక్.
లక్ష్మి పార్వతితో ఎన్టీఆర్ ద్వితీయ వివాహం అయ్యాక తారక్ అంత చిన్నవయసులోనే ఆమె మీద కోపం పెంచుకున్నాడని పలు సందర్భాల్లో తమ దంపతుల ఫోటోలు చించుతుండగా తాను గమనించానని స్వయంగా లక్ష్మి పార్వతి అప్పుడెప్పుడో ఇంటర్వ్యూలో చెప్పిన దాఖలాలు ఉన్నాయి. వర్మ సరిగ్గా ఇదే సీన్ ని లక్ష్మీస్ ఎన్టీఆర్ లో పెట్టినట్టు వినికిడి. బాల్యంలోని సీన్ కాబట్టి ఎవరికీ అభ్యంతరం రాదని వర్మ ఉద్దేశం కావొచ్చు
కానీ నిజంగా ఆ సీన్ సినిమాలో ఉంటె అభిమానుల నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశం లేకపోలేదు. ఎంత పసిపిల్లాడిగా ఉన్నప్పుడు చేసినా తాతయ్యను దేవుడుగా భావించే తారక్ ని అలాంటి సన్నివేశంలో చూపించడం అంటే ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బ తీయడమే అవుతుంది. పైగా నిజమో కాదో తెలియని ఇలాంటి సున్నితమైన సంఘటలను స్పృశించడం వల్ల లేనిపోని గ్యాప్స్ వచ్చేందుకు కారణం అవుతాయి.
అందుకే ఇటీవలే వైఎస్ ఆర్ పార్టీలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మావయ్య తన పలుకుబడి ఉపయోగించి నిజంగా ఈ సీన్ ఉందా లేదా కనుక్కుని ఉంటె మాత్రం తీయించే పనిలో ఉన్నారట. ఈ వార్తల సంగతి ఏమో కానీ విడుదల దగ్గర పడే కొద్దీ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇంకొన్ని సంచలనాలకు వేదికగా మారేలా ఉంది